సెప్టెంబర్ 3 నుండి 6 వరకు బెస్ట్ & ఫైర్ అకాడమీ స్టాక్ మార్కెట్ కి సంబంధించి జాతీయ శిక్షణా కార్యక్రమాన్ని న్యూ జెర్సీ లో నిర్వహించింది. సుమారు 500 ట్రేడర్స్ పాల్గొన్న ఈ సదస్సుకు అపూర్వ స్పందన వచ్చింది. కొంతమంది ఉద్వేగభరితమైన ట్రేడర్స్ సమూహంతో నాట్-ఫర్-ప్రాఫిట్ గా ఏర్పడి పురుషులు, మహిళలు మరియు రేపటి నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ని సాధికారత దిశగా ప్రయాణించేలా చేసి ఆర్థికంగా సుసంపన్నం చెయ్యడం ఈ బెస్ట్ (BEST – Businesses in Engineering, Sciences & Technology) & ఫైర్ (FIRE – Financial, Investment & Retirement Education) అకాడమీ ముఖ్య ఉద్దేశం. డాక్టర్స్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్, రియల్ ఎస్టేట్ లాంటి వివిధ వ్యాపార రంగాలలో ప్రపంచం నలుమూలల తెలుగు ప్రజలు ఎనలేని కీర్తిని సంపాదించారు. కానీ ఇప్పటికి స్టాక్ మార్కెట్ అనగానే దాన్నో భూతంలాగా చూస్తారు, ఇంకొందరు పేకాటతో పోల్చుతారు. వీరందరూ మర్చిపోతున్న ఒక ముఖ్యమైన అంశం సంపదని అభివృద్ధి చేసుకునే అవకాశాలలో స్టాక్ మార్కెట్ కూడా ఉంది అని చరిత్ర చెబుతున్న సాక్ష్యం.
బెస్ట్ & ఫైర్ అకాడమీ గడిచిన 6 ఏళ్ళగా ప్రతి వారం పేరెన్నిక కలిగిన క్రియాశీల ట్రేడర్స్ తో స్టాక్ మార్కెట్ పై వెబ్ క్లాస్ నడుపుతుది. అంతేకాకుండా సుమారు 2000 ఏక్టివ్ ట్రేడర్స్ ప్రతీరోజు ఒకరికి ఒకరు నిరంతరం సహకరించుకుంటూ SP500 లాంటి వాటిని కూడా అధిగమిస్తున్నారు. ప్రతి సంవత్సరం నేషనల్ వర్క్ షాప్స్ చెయ్యడం అనవాయితీ మరియు వాటిలో పాల్గొన్నవారు మేదోమధనం చెయ్యడం రివాజు. ఈ సదస్సులో వాల్ స్ట్రీట్ బ్యాంక్స్, ఫండ్ మేనేజర్స్, అకడమిక్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన ప్రత్యేక అతిధిలతో, టెక్నికల్ అనాలసిస్, ఫండమెంటల్ అనాలసిస్, ఫ్యూచర్స్, క్రిప్టొ, ప్రి-ఐ.పి.ఒ లాంటి ఎన్నో కీలకమైన అంశాలపై చర్చలు జరిగాయి. ప్రత్యేక సెషన్స్ ఆప్షన్ ట్రేడింగ్ – పుట్స్, కాల్స్, స్ట్రెంగిల్స్, స్ట్రేడెల్స్, కేలండర్స్, బటర్ ఫ్లై మరియు డయాగినల్స్ వాటిపై కూడా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఏక్టివ్ ట్రేడర్స్ రిటైర్మెంట్ మరియు ఎడ్యుకేషన్ అంశాలు అయిన IRA, 401K, Roth’s, 529’s పై జరిగిన చర్చలపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రియల్ ట్రేడర్స్ వారిచే రిస్క్ మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మరియు పొజిషన్ సైజింగ్ వంటి వాటి మీద శిక్షణ ఇవ్వడం జరిగింది.
బిజినెస్ టైకూన్స్ శ్రీ సుబ్బు కోట గారు, శ్రీ డాక్టర్ సాయి కొల్ల గారు, శ్రీ ఉదయ్ భాస్కర్ కొట్టె గారు, శ్రీ శేఖర్ పులి గారు, శ్రీ డాక్టర్ నాగిరెడ్డి గారు మరియు శ్రీ ఆనంద్ పాలూరి (ఆండీ) గారు లాంటి పెద్దలు బ్యాంక్వెట్ డిన్నర్ లో పాల్గొని చుక్కలు లాగ మెరవడమే కాకుండా కాకుండా బెస్ట్ & ఫైర్ అకాడమీకి అందం చేకూర్చారు. నాలుగు రోజులుగా 25 గంటలు ప్రాక్టికల్ శిక్షణా తరగతులు, తమ మేధస్సుని తెలుగు ప్రజలకు పంచిన ఉన్నతులకు సన్మానాలు జరగడం ఎంతో ఆనందదాయకం. విజ్ణానంతో కూడిన విలాసవంతమైన వర్క్ షాప్స్ నడవడానికి ముందుకు వచ్చిన దాతలు శ్రీ సుబ్బు కోట గారు, శ్రీ వెంకట్ యేరుబండి గారు, శ్రీ విజయ్ రామిసెట్టి గారు, శ్రీ ఓం ప్రకాష్ నక్క గారు, శ్రీ చంద్ర శేఖర్ నల్లం గారు, శ్రీ రవి వర్రె గారు, శ్రీ సాగర్ లగిసెట్టి గారు, శ్రీ విజయ్ గుడిసేవ గారు, శ్రీ డాక్టర్ సూర్య రఘుతు గారు, శ్రీ సత్య బల్లా గారు, శ్రీ ఫణి ముత్యాల గారు, శ్రీ సురేష్ చీలంకుర్తి గారు ఇంకా మరెందరో దాతలకు హృదయ పూర్వక అభినందనలు. బెస్ట్ & ఫైర్ అకాడమీ వర్క్ షాప్ ఆర్గనైజర్స్ శ్రీ వెంకట్ యేరుబండి గారు, శ్రీ విజయ్ రామిసెట్టి గారు, శ్రీ హరి కూరగాయల గారు మరియు శ్రీ జే చిమట గార్లకు ప్రత్యేక అభినందనలు.