నందమూరి బాలకృష్ణ కి తెలుగు నాట పబ్లిసిటీకి కొదవలేదు అనడంలో సందేహం లేదు. ఆమాటకొస్తే తనకి పబ్లిసిటీ అనడంకంటే, తాను ఏది చేసినా మీడియాకి పబ్లిసిటీ చేసుకునే అవకాశం వచ్చిందని మీడియా సంస్థలు సంబరపడతాయి అనటంలో ఆశ్చర్యంలేదు. ఐతే ఇప్పుడు జాతీయ మీడియా కూడా ఈ నందమూరి అందగాడు మీద కన్నేసిందట. ఎందుకనుకుంటున్నారా! అదేనండి మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాజపా చేసిన అన్యాయానికిగాను ధర్మపోరాట దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆ దీక్షలో బాలయ్య తెలుగుతో పాటు హిందీలో కూడా మోడీని ఉతికి ఆరేసిన విషయాన్ని జాతీయ మీడియా సైతం విస్తృతంగా ప్రసారం చేసిందట. దీంతో మోడీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీని ఒక్కమాట అనాలన్నా భయపడుతున్న ఈరోజుల్లో బాలయ్య దైర్యంగా ధర్మపోరాట దీక్షా వేదిక సాక్షిగా కడిగి పారేయడంతో ఏదేమైనా ఆ దమ్ము ధైర్యం బాలయ్య సొంతం అంటున్నారు అభిమానులు.