New Jersey, USA: ఏ దేశం ఏగినా.. ఎందుకాలిడినా… మరవకురా నీ సంస్కృతీ సాంప్రదాయం… మన విజ్ఞానం… మన ఆర్ధిక ప్రగతి … మన మూలాల నుంచి మనల్ని దూరం చేయకూడదు. స్వామియే శరణం అయ్యప్ప… స్వామి శరణం… అయ్యప్ప శరణం.
అమెరికాలోని న్యూజెర్సీ (New Jersey) లో ‘సాయిదత్త పీఠం’ ఆధ్వర్యంలో శ్రీ శివ విష్ణు దేవాలయం (Lord Siva Vishnu Temple) లో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది. హరి హర సుతుడు అయ్యప్ప శరణు ఘోష లతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. గురు స్వాములు రఘు శర్మ శంకరమంచి, అశోక్ వల్లెపు, సుమన్ నిమ్మల మరియు విలాస్ రెడ్డి జంబుల (Vilas Reddy Jambula), వెంకట్ రెడ్డి మూలం, భరత్ శ్యామ్, శ్రీకాంత్ భోగరాజు, రాజేష్ రెడ్డి గుదిబండి స్వామి ల ఆధ్వర్యం లో పడిపూజ జరిగింది.
మాలలతో అలంకరించిన విజ్ఞేశ్వర, సుబ్రమణ్య స్వాములతో పువ్వులు, దీపాలు మరియు పండ్లతో అలంకరించిన పద్దెనిమిది పడి మెట్లపై స్వామి సేద తీరాడు. అయ్యప్ప (Lord Ayyappa) సాయి భజనలతో భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారికి పుస్పాభిషేకం, పంచామృతం, చందనం మరియు విభూది తో అభిషేకం చేసారు.
స్వామివారికి ప్రియమైన పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పద్దెనిమిది మెట్లపై పిల్లల చేత కర్పూర దీపం వెలిగించారు. చాలా కాలం తర్వాత పడిపూజ లో పాల్గొనడం ఆనందం గా ఉందని అయ్యప్ప మాల వేయని ఇతర భక్తులు తెలిపారు.
ఆలయంలో నిత్య పూజలతో పాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వైభవంగా చేస్తున్నారు. వీటితో భారత సంప్రదాయం ప్రకారం పండుగలను నిర్వహిస్తూ అయ్యప్ప మాలాధారణ చేపడుతున్నారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు భక్తులు అయ్యప్ప స్వామి సేవలో తరిస్తారు.
41 రోజుల మండల దీక్షతో పాటు వారికి అనుకూలమైన 21 రోజులు లేదా 11 రోజులు లేదంటే వారి మొక్కుకు అనుసరించి మాలధారణ చేస్తారు. కఠిన నియమాలు పాటిస్తూ స్వామి వారిని కొలుస్తూ ఉంటారు. మొక్కు చెల్లించుకునేందుకు ఇరుముడిని ధరించి స్వామి వారికి సమర్పించి మాలను విరమిస్తారు.
శ్రీదత్త పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ శివ విష్ణు దేవాలయంలో అయ్యప్ప స్వామి పడి పూజ ఘనంగా జరిగింది. అయ్యప్ప స్వామి మహా పడి పూజ డిసెంబర్ 22న మరియు అయ్యప్ప (Lord Ayyappa) ఇరుముడి పూజలు డిసెంబర్ 25న జరగబోతున్నాయి.
ఈ కార్యక్రమములో రఘు శర్మ శంకరమంచి (Raghu Sankaramanchi, విలాస్ రెడ్డి జంబుల, అశోక్, సుమన్, ఉపేంద్ర చివుకుల, వెంకట్ రెడ్డి, భరత్, శ్రీకాంత్, రాజేష్, కృష్ణ రెడ్డి ఏనుగుల, సుధాకర్ ఉప్పల, దాము గేదెల, అమర్ జున్నుతుల, పృదీష్ మక్కపాటి (Prudeesh Makkapati), సంతోష్ కోరం, నరేంద్ర రేపాక, శ్రీకాంత్ యదా, సుబ్బారెడ్డి, కార్తీక్ చెరలో, శ్రీహరి దండు, రాణి మాత, చిత్రలేఖ, హేమ, శృతి, వాసవి, మాధురి, రాధికా, అమిత, సందీప్, అశోక్, శశి, విజయ్, వినోద్ మరియు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.