ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ని అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు అట్లాంటా ప్రవాసులు నిరసన తెలుపుతూ టీడీపీ అధినేతకు మద్దతుగా నిలిచారు.
జార్జియా రాష్ట్రం, ఆల్ఫారెటా (Alpharetta) లోని స్థానిక పెర్సిస్ లో సమావేశమై ప్రొటెస్ట్ చేశారు. సేవ్ డెమోక్రసీ సేవ్ ఏపీ, ఉయ్ ఆర్ విత్ సీబీఎన్ అంటూ నినాదాలు (Slogans) చేశారు. తెలుగుదేశం పార్టీ (TDP) జెండాలు, ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో సతీష్ ముసునూరి (Satish Musunuri), సురేష్ పెద్ది, శరత్ అనంతు, వెంకట్ నర్రా, సురేష్ చన్నమల్లు, రవి కిరణ్ మొవ్వ, దుశ్యంత్ నర్రావుల తదితర తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
సతీష్ ముసునూరి, సురేష్ పెద్ది, రవి కిరణ్ మొవ్వ తదితరులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన రోజు ఒక దుర్దినం, బ్లాక్ డే ఆఫ్ ఏపీ, బ్లాక్ డే ఆఫ్ ఇండియా అని అన్నారు. ఇటువంటి పరిస్థితులు తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజలందరూ నిజాలు తెలుసుకోవాలన్నారు.
అలాగే అవినీతిపరులు రాజ్యమేలితే నిజాయితీపరులు జైల్లో ఉంటారన్న నానుడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే అర్ధం అవుతుందని అన్నారు. పెద్ద పెద్ద హత్యలు చేసినవారేమో దర్జాగా బయట తిరుగుతుంటే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుని అమానుషంగా అరెస్టు చేశారన్నారు.