Connect with us

Movies

ప్రభాస్ 44వ జన్మదినం, Atlanta Darling Fans లోగో ఆవిష్కరణ

Published

on

అక్టోబర్ 23, అట్లాంటా: ఉప్పలపాటి ప్రభాస్ రాజు (Uppalapati Venkata Suryanarayana Prabhas Raju) అంటే ఒక క్షణం అలోచిస్తారు గాని అదే డార్లింగ్ ప్రభాస్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేశారు ప్రభాస్.

ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలి, సాహో సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పర్చుకోవడమేకాకుండా ప్రేక్షకుల గుండెల్లో డార్లింగ్ గా స్తిరనివాసం కట్టుకొన్న అచ్చ తెలుగు హిరో.

అక్టోబర్ 23 ప్రభాస్ 44వ జన్మదిన వేడుకలు (Birthday Celebrations) పురస్కరించుకొని అట్లాంటా ప్రభాస్ ఫేన్స్ డార్లింగ్ లోగో ఆవిష్కరించడం జరిగింది. ఏంతో ఘనంగా జరిగిన ఈ వేడుకలో ప్రభాస్ తదుపరి చిత్రం సలార్ ఘనవిజయం సాదించాలని, భారతీయ చిత్రపరిశ్రమ రికార్డ్స్ కొల్లగొడ్డాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకలు అమెరికాలో ప్రభాస్ ప్రతీ సినిమా ప్రిమియం షోస్ ఘనంగా నిర్వహించడంలో కీలకప్రాత్ర పోషించిన ప్రభాస్ ఫేన్స్ (Atlanta Prabhas Fans) ప్రెసిడెంట్ హేమంత్ పెనుమత్స ఆధ్వర్యంలో అట్లాంటాలో “అట్లాంటా డార్లింగ్ ఫేన్స్” లొగో ను ఆవిష్కరించడం జరిగింది.

– సురేష్ కరోతు

error: NRI2NRI.COM copyright content is protected