జార్జియా రాష్ట్రం, అట్లాంటా నగరానికి దగ్గిరలోని వారెంటన్ లో ఏప్రిల్ 19 నుండి 23 వరకు అతిరుద్ర యాగం నిర్వహిస్తున్నారు. సిద్ధాశ్రమ్ ఆఫ్ నార్త్ అమెరికా లో జరగనున్న ఈ అతిరుద్ర యాగంలో అందరూ పాల్గొని, శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహా స్వాముల వారి ఆశీర్వాదముతో ఆ మహాదేవుడి కృపకు పాత్రులు కావాలిసిందిగా మనవి చేస్తున్నారు నిర్వాహకులు.
ఇప్పటికే 108 హోమ గుండాలు నిర్మితమయ్యాయి. అమెరికాలోని పలు రాష్ట్రాలనుండి భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఉత్తర అమెరికాలోని అతిపెద్ద హిందూ దేవాలయ ప్రాంగణంగా రూపుచెందనుందనడంలో అతిశయోక్తి లేదు.
శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు అట్లాంటాలోని శ్రీ దేవి పీఠం నందు అనుగ్రహభాషణం ఇస్తూ త్వరలో అట్లాంటా దగ్గర్లో 500 ఎకరాల్లో ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఆశ్రమం నిర్మాణానికి ఉపక్రమించడం అట్లాంటా వాసుల అదృష్టంగా భావిస్తున్నారు.
రాబోయే రోజుల్లో ఈ క్రింది ప్రణాళికలకు శ్రీకారం చుట్టనున్నారు. . జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులవారి 108 అడుగుల విగ్రహ ప్రతిష్టాపనకు సంకల్పం. . వేద పాఠశాల. . యోగ విద్యాలయం. . సేంద్రీయ వ్యవసాయం. . చుట్టుపక్కల గ్రామాల వారికి 24 గంటల వైద్య సదుపాయం. . భారతదేశానికి చెందిన ఆవులతో పాల ఉత్పత్తి.