Connect with us

Convention

ఆటా ‘సయ్యంది పాదం’ డాన్స్ పోటీలు, మీ ఆటకి వేదిక ‘ఆటా’

Published

on

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వాషింగ్టన్ డిసి లో జులై 1 నుంచి 3 వరకు నిర్వహించబోయే 17వ మహాసభలకు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మహాసభలలో భాగంగా మీ ఆటకి మా ‘ఆటా’ వేదిక అంటూ డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నారు.

క్లాసికల్ మరియు నాన్ క్లాసికల్ విభాగాల్లో సోలో, గ్రూప్‌ డాన్స్‌ పోటీలు ఉన్నాయి. జులై 1 నుంచి 3 వరకు ఆటా మెగా కన్వెన్షన్‌ వేదికగా ఫైనల్స్ రౌండ్ నిర్వహిస్తారు. 7 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సు పైబడిన వారు ఎవరైనా పోటీల్లో పాల్గొనే సదవకాశం ఉంది. వర్జీనియా, డల్లాస్, న్యూ జెర్సీ, ర్యాలీ, అట్లాంటా, నాష్విల్, సియాటిల్, లాస్ ఏంజలెస్, పోర్ట్లాండ్, డెట్రాయిట్, చికాగో నగరాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు.

ఫైనల్స్ రౌండ్ కి టాలీవుడ్ డాన్స్ మాస్టర్ శేఖర్ జడ్జిగా వ్యవహరిస్తారు. విజేతలకు స్టార్ సెలెబ్రెటీస్ చేతుల మీదుగా అవార్డు పొందే అద్భుత అవకాశం, మరెందుకాలస్యం మీ ఆడిషన్ ఎంట్రీ www.ataconference.org/events-registrations లో రిజిస్టర్ చేసుకోండి. అలాగే మహాసభల వివరాలకు www.ataconference.org ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected