Connect with us

Events

స్ఫూర్తి నింపిన ఆటా మహిళా దినోత్సవ వేడుకలు: Virginia

Published

on

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ వర్జీనియా రాష్ట్రం లో మార్చి 5 వ తేది శనివారం రోజున ఘనంగా వేడుకలు నిర్వహించారు. 400 కి పైగా మహిళలు పాల్గోన్న ఈ కార్యక్రమాన్ని దీపికా బుజాల, అపర్ణ కడారి నేత్రుత్వంలో 17 వ ఆటా కాన్ఫరెన్స్ ఉమెన్స్ ఫోరమ్ ప్రశాంతి ముత్యాల, రజనీ పాడూరు, డాక్టర్ శ్రీలేఖ పల్లె, విజయ దొండేటి మరియు పద్మ పుట్రేవు దిగ్విజయంగా నిర్వహించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్స వేడుకను ప్రారంభించిన మొదటి జాతీయ తెలుగు సంస్థ ఆటా, 10వ వార్షికోత్సవం జరుపుకుంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలలో మహిళలు చాలా ఉత్సాహం గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలుగు పాట్య పుస్తకాలు రచించి తెలుగు బాషకి ఎన్నో సేవలు అందించినరచయిత డాక్టర్ సరోజన బండా, వాషింగ్టన్ ఏరియాలోని తెలుగు సంఘాలకు అద్యక్షులుగా సేవలు అందించిన టీడీఫ్ మాజీ అధ్యక్షురాలు కవిత చల్లా, కాట్స్ మాజీ అధ్యక్షురాలు సుధా రాణి కొండపు, జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు, పిలుపు టీవి అధ్యక్షురాలు ఆవంతిక నక్షత్రం మరియు అనిత ముత్తోజు వంటి మహిళా నాయకులను సత్కరించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన రానాప్రతాప్‌ చెగు, డాక్టర్ రీనా బొమ్మసాని, లక్ష్మీ పురిషోత్తమన్, ప్రీతి మునగపాటి వారి వారి రంగాల్లో వారి అనుభవాలతో పాటు మహిళా సాధికారత, మహిళా ఆరోగ్యం, మహిళా అభ్యున్నతి, ఆర్థిక స్వాతంత్య్రం అంశాలపై వారి విలువైన అభిప్రాయాలను, సలహాలను, సూచనలను అందరీతో పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఆటా కాన్ఫరెన్స్ నిర్వహకులు జయంత్ చల్లా, రవి చల్లా, శ్రవణ్ పాడూరు, రవి బొజ్జ, అమర్పాశ్య, హనిమి వేమిరెడ్డి, కౌశిక్ సామ, సతీష్ వద్ది, భాస్కర్ బొమ్మారెడ్డి, రమణా రెడ్డి మాట్లాడుతూ జులై 1,2 & 3 న వాషింగ్టన్ డీసీ లో జరగబోయే 17వ ఆటా కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ కి ఇదే ఉత్సాహంతో పాల్గోని జయప్రదంచేయవలసిందిగా కోరారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected