Connect with us

Convention

వర్జీనియాలో ‘ఆటా’ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగువారు

Published

on

వాషింగ్టన్ DCలో జూలై 1 నుండి జూలై 3 వరకు జరగనున్న ATA కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ సందర్భంగా, 17వ ATA కన్వెన్షన్ టీమ్ మే 14 తేదీన వర్జీనియాలో “టేబుల్ టెన్నిస్” పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో DC, MD మరియు VA రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు చురుగ్గా పాల్గొన్నారు.

మే 14న హెండన్ సిటి లోని కాసెల్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చాలా ఉత్సాహభరితంగా టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా హాజరు కాగా 120 మంది పోటీల్లో పాల్గొన్నారు. మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో సుష్మిత-కుసుమ డబుల్స్‌లో గెలుపొందగా, అజిత-స్వాతి ద్వితీయ స్థానంలో నిలిచారు.

మహిళల సింగిల్స్ టైటిల్‌ను మాధురి బుజలెమ్మ గెలుచుకోగా, సుస్మిత రన్నరప్‌గా నిలిచింది. పురుషుల విభాగంలో డివిజన్ 1 విజేత శరత్, రన్నరప్ రామకృష్ణ. డివిజన్ 2 విజేత వివేక్, 2వ స్థానం కిషోర్. విక్రమ్‌, చంద్ర డబుల్స్‌ టైటిల్స్‌ గెలుపొందగా, కిషోర్‌, మురళి రన్నరప్‌లుగా నిలిచారు. మిక్స్‌డ్‌ డబుల్‌ విభాగంలో అజిత, వివేక్‌అజిత, వివేక్‌  టైటిల్‌ గెలుచుకోగా,  శ్రుతి, చంద్ర 2వ స్థానంలో నిలిచారు. సుధీర్ కోడం మరియు జట విష్నుబొట్ల “టేబుల్ టెన్నిస్” పోటీలకు న్యాయ నిర్నేతలుగ వ్యహరించటం జరిగింది.

ఈ కార్యక్రమాలను సుధీర్ దామిడి స్పోర్ట్స్ చైర్, శ్రీధర్ బండి స్పోర్ట్స్ కో-చైర్, శీతల్ బొబ్బా మహిళా స్పోర్ట్స్ చైర్ విజయవంతంగా నిర్వహించారు. క్యాపిటల్‌ ఏరియా తెలుగు అసోసియేషన్‌ (CATS) ప్రెసిడెంట్‌ సతీష్‌ వడ్డి, Local Coordinator శ్రవణ్ పాడురు, మీడియా కమిటీ చైర్ రాము ముండ్రాతి మరియు కో చైర్‌ సునీల్ కుడికల ,హాస్పిటలిటి కమిటీ చైర్ అమర్ పాశ్య మరియు కో చైర్‌ , వాలంటీర్ కమిటీ చైర్ లోహిత్,సుధీర్ దామిడి స్పోర్ట్స్ చైర్, శ్రీధర్ బండి స్పోర్ట్స్ కో-చైర్, శీతల్ బొబ్బా మహిళా స్పోర్ట్స్ చైర్ టీమ్‌ విజేతలను అభినందించి బహుమతులు అందించారు.

error: NRI2NRI.COM copyright content is protected