Connect with us

News

ATA President Elect Jayanth Challa: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ ఉప కులపతి కొలకలూరి ఇనాక్, ప్రముఖ అవధాని నరాల రామారెడ్డి ల మర్యాద పూర్వక కలయిక

Published

on

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (Sri Venkateswara University) పూర్వ ఉప కులపతి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు అమెరికాలో పలు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిన్న అక్టోబర్ 3న వర్జీనియాలో అమెరికా తెలుగు సంఘం (ATA) ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా శ్రీ ఇనాక్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు.

హైదరాబాద్ లో డిసెంబర్ 17న జరగనున్న ఆటా (American Telugu Association) డేస్ సాహిత్య కార్యక్రమాల్లో, అలాగే జూన్ లో జరిగే ఆటా కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందిగా ఇనాక్ గారికి పుష్పగుచ్ఛం ఇచ్చి జయంత్ ఆహ్వానించారు. శ్రీ ఇనాక్ గారు చాలా సంతోషంగా ఈ ఆహ్వానాన్ని స్వీకరించి వెంటనే తన అంగీకారం తెలిపారు.

అలాగే ప్రముఖ అవధాని నరాల రామారెడ్డి గారిని కూడా జయంత్ చల్లా హైదరాబాద్ ఆటాడేస్ సాహితీ కార్యక్రమాలకి, అమెరికాలో జరగనున్న ఆటా కన్వెన్షన్ కి ఆహ్వానించారు. ఆటా డేస్ (ATA Days) సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు వేణు నక్షత్రం సమక్షంలో ఈ కార్యక్రమం వర్జీనియాలో జరిగింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected