Connect with us

Schools

ATA లైబ్రరీ ప్రారంభం, కంప్యూటర్ల అందచేత @ Medchal, Telangana

Published

on

. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, బాచుపల్లి పాఠశాలలో ఆటా ఆధ్వర్యంలో లైబ్రరీ ప్రారంభం, కంప్యూటర్ల అందచేత
. పిల్లలు ఫోన్లకు దూరంగా ఉండాలి
. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి
. స్కూల్ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం
. బాచుపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటా వేడుకల చైర్, ప్రెసిడెంట్ ఎలక్ట్ జయంత్ చల్లా

చదువుకునే పిల్లలు ఫోన్లకు, సోషల్ మీడియా కు దూరంగా వుండాలని ఆటా (ATA) వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa) విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆటా ఆధ్వర్యంలో మేడ్చల్ (Medchal) మల్కాజ్ గిరి జిల్లా పరిధిలో గల బాచుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాచుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (School) ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జయంత్ చల్లా మాట్లాడుతూ… తాము కూడా ప్రభుత్వ బడులలోనే చదువుకొని ఉన్నతంగా ఎదిగామని, ఇక్కడి విద్యార్థులు కూడా అలానే ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి దేశానికి మంచి పేరు తేవాలని కోరారు. అమెరికా, భారత్ స్కూల్స్ మధ్య తేడాలను విద్యార్థులు అడుగగా వాటి మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. అలాగే అక్కడ ఆట స్థలం, డిజిటల్ కంప్యూటర్ల సమస్య ఉందని ఆటా (American Telugu Association) నాయకులకు విద్యార్థులు తెలిపారు.

దీంతో స్థానిక ఎమ్మెల్యే, ఇతర CSIR కంపెనీ లతో ఆటా మాట్లాడి వారి సహకారంతో స్కూల్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, స్కూల్ కు, ఆటా (ATA) కు మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించిన జ్యోత్స్న బొబ్బాల ను ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రాజ్ కక్కెర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్స్ అమృత్ ముళ్ళపూడి, డా.సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected