Connect with us

College

ATA @ Osmania University: అకడమిక్ ప్రగతి & పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంపై Vice Chancellor తో చర్చ

Published

on

Hyderabad, Telangana: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధి బృందం, ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మోలుగరం గారి ఆహ్వానం మేరకు ఆయనను కలసి, విశ్వవిద్యాలయ అకడమిక్ ప్రగతి మరియు పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంపై చర్చించింది.

ఈ సమావేశంలో ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా (Jayanth Challa), మాజీ అధ్యక్షులు పర్మేష్ భీమ్‌రెడ్డి (Parmesh Bheemreddy), ట్రస్టీ కాశీ కోత, విద్యా సలహాదారు ప్రొఫెసర్ రాజశేఖర్, ఆటా ఇండియా టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అలుమ్ని అసోసియేషన్ (OUAA–Global) అధ్యక్షులు హరినాథ్ మేడీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ భేటీని ఉస్మానియా యూనివర్సిటీ అలుమ్ని అసోసియేషన్ (Osmania University Alumni Association) ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఈ. సుజాత సమన్వయం చేశారు. సమావేశంలో ఉపకులపతి (Vice Chancellor) ప్రొఫెసర్ కుమార్ మోలుగరం గారు, ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధిపై తన దృష్టికోణాన్ని వివరించడంతో పాటు, విద్యా నాణ్యతను మరింత పెంపొందించడంలో ఎన్ఆర్ఐల (NRI) పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో విశ్వవిద్యాలయం సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ, 2024లో 70కు పైబడిన స్థానం నుంచి 2025 నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ఓవరాల్ విభాగంలో 53వ స్థానాన్ని ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) దక్కించుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విభాగంలో 7వ స్థానాన్ని కూడా సాధించినట్లు వెల్లడించారు.

అలాగే, బోధనా సిబ్బంది మరియు ల్యాబొరేటరీ సహాయకుల కొరతను ఉపకులపతి (Vice Chancellor) గారు ప్రస్తావిస్తూ, ప్రస్తుత ఖాళీలను భర్తీ చేయడానికి ప్రొఫెసర్లు మరియు ల్యాబ్ అసిస్టెంట్ల నియామకం అత్యవసరమని తెలిపారు. విశ్వవిద్యాలయ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఆధునికీకరణ కోసం గౌరవ Telangana ముఖ్యమంత్రి గారు రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులను ఉద్దేశించి, ఉస్మానియా ఫౌండేషన్‌కు విరాళాలు అందించి విశ్వవిద్యాలయ విద్యా మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడాలని ఉపకులపతి (Vice Chancellor) గారు కోరారు. విరాళాల వినియోగంలో పూర్తి పారదర్శకత మరియు బాధ్యత ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆటా తరఫున, 2026 జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని బాల్టిమోర్‌ (Baltimore) లో జరగనున్న 19వ ఆటా అంతర్జాతీయ సదస్సుకు (Convention) ఉపకులపతి గారిని ప్రతినిధి బృందం ఆహ్వానించింది.

ఈ సదస్సులో ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక సెషన్ నిర్వహించి, విశ్వవిద్యాలయ భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి సూచనలు సేకరించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతును సమీకరించే అవకాశం కల్పించనున్నారు. అవసరమైన సంస్థాగత అనుమతులు లభిస్తే సదస్సుకు హాజరవుతానని ఉపకులపతి గారు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected