అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ 17వ మహాసభల సమయాత్తంలో భాగంగా వివిధ నగరాల్లో ఆటా డే మరియు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహింస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 5న జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నిర్వహించిన వేడుకలు అదరహో అనేలా సాగాయి.
నార్క్రాస్ లోని స్థానిక ఏషియానా బాంక్వేట్ హాల్లో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన వేడుకలు రాత్రి 11 గంటల వరకు సాగాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల మరియు కన్వీనర్ సుధీర్ బండారు ప్రత్యేకంగా వాషింగ్టన్ డీసీ నుంచి ఈ వేడుకలకు హాజరవడం విశేషం.
ఆటా అట్లాంటా నాయకత్వం కరుణాకర్ అసిరెడ్డి, కిరణ్ రెడ్డి పాశం, గౌతమ్ గోలి, అనిల్ రెడ్డి బొద్దిరెడ్డి, వేణు పిసికే, ఇంకా ఇతర బోర్డు ఆఫ్ ట్రస్టీస్, రీజినల్ డైరెక్టర్స్, రీజినల్ కోఆర్డినేటర్స్ మరియు మహిళా కోఆర్డినేటర్స్ అందరూ ఈ వేడుకలు ఘనంగా జరిగేలా ప్లాన్ చేసారు. స్థానిక సిటీ కౌన్సిల్ సభ్యులు హాజరై తమ మద్దతు తెలియజేసారు
స్థానిక పెద్దలతోపాటు తానా, నాటా, టాటా, టీడీఫ్ లాంటి జాతీయ సంఘాల నేతలు, అలాగే తామా, గాటా, గేట్స్, ఐఫా వంటి స్థానిక ప్రాంతీయ సంఘాల నేతలు విరివిగా హాజరవడం అభినందనీయం. దీంతో అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగానే సుమారు 6 లక్షల డాలర్ల కంటే పైనే ఆటా 17వ మహాసభలకువిరాళాలు సేకరించి అట్లాంటా సత్తా చాటారు.
కార్యక్రమం ఆసాంతం ఫోక్, క్లాసికల్ సాంస్కృతిక కార్యక్రమాలు, సిక్స్ స్ట్రింగ్స్ పాటలు, ఫ్యాషన్ షో, ట్రివియా ప్రశ్నలతో సరదాగా సాగింది. మధ్యలో యూనివర్సల్ సాయి అసోసియేషన్ ప్రెసిడెంట్ రంగారావు సుంకర, నీలిమ గడ్డమణుగు, విజు చిలువేరు, అరుంధతి కోడూరు వంటి ప్రముఖులను సన్మానించారు.
అలాగే వివిధ సంఘాల నాయకులను వేదికమీదికి ఆహ్వానించి తమ సహాయసహకారాలకుఅభినందించారు. లావణ్య గూడూరు, శృతి చిత్తూరు ల వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. చాలాకాలం తర్వాత ముఖాముఖీ ఈవెంట్ కావడంతో ఆహుతులు అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ కలియ తిరుగుతూ కనిపించారు.
జనార్ధన్ పన్నెల తన ఫోక్ సాంగ్స్ తో ముఖ్యంగా డీజే టిల్లు సినిమాలోని టైటిల్ సాంగుతో అదరగొట్టగా, ఆటా లీడర్షిప్ మరియు ప్రేక్షకులు డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లేలా డాన్స్ చేసారు.చివరిగా విందు భోజనంతో వేడుకలు ఘనంగా ముగించారు.మరిన్ని ఫోటోల కొరకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి.