Connect with us

Convention

తమన్ హై వోల్టేజ్ పాటలతో అట్లాంటాలో అట్టహాసంగా ఆటా కన్వెన్షన్ ముగింపు

Published

on

అమెరికా తెలుగు సంఘం (ATA) 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ అట్లాంటా లో అట్టహాసంగా ముగిసింది. చివరి రోజైన ఆదివారం జూన్ 9న తెలుగు సినీ సంగీత దర్శకులు ఎస్ ఎస్ తమన్ (SS Thaman) హై వోల్టేజ్ పాటలతో గ్రాండ్ ముగింపునిచ్చారు. ఆటా కన్వెన్షన్ మొదటి రోజు బాంక్వెట్ డిన్నర్ మరియు రెండవ రోజు కన్వెన్షన్ ఇనాగరల్ కవరేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వివరాల్లోకి వెళితే… గత మూడు రోజులుగా ఆటా మహాసభలు (18th ATA Convention & Youth Conference) అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటి రోజు బాంక్వెట్ డిన్నర్ లో అనూప్ రూబెన్స్ (Anup Rubens), రెండవ రోజు కన్వెన్షన్ ఇనాగరల్ లో త్రీరీ బ్యాండ్ (Threeory Band), చివరి రోజు తమన్ (SS Thaman) సంగీత విభావరి వేటికవే సాటి అనేలా ఉన్నాయి.

మూడో రోజు ఉదయాన్నే ఇండియా (India) నుంచి విచ్చేసిన పండితులతో నిర్వహించిన భద్రాచల దేవస్థానం వారి శ్రీ సీతారాముల కల్యాణంతో ఆహ్వానితులు అందరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. భద్రాచల పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణం పూర్తి చేశారు. అందరూ ప్రసాదం అందుకున్నారు.

తెలుగువారి సొంతమైన సాహితీ ప్రక్రియలు, ఉమెన్స్ ఫోరమ్ డిస్కషన్స్, కంటిన్యూఇంగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (Continuing Medical Education), బిజినెస్ ఫోరమ్, యూత్ ఇన్నోవేషన్స్, స్పిరిచువల్ ఫోరమ్, దాజి హెర్ట్ఫుల్నెస్ సెషన్స్ (Heartfulness Meditation), పొలిటికల్ ఫోరమ్ (Politics) వంటి కార్యక్రమాలు వివిధ బ్రేకవుట్ రూమ్స్ లో నిర్వహించారు.

ఉమెన్స్ ఫోరమ్ లో సినీ హీరోస్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తళుక్కున మెరవడంతో జనాన్ని కంట్రోల్ చేయడంలో సెక్యూరిటీ కి బాగానే పని పడింది. అందరూ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఫ్యాన్ షర్ట్ వేసుకున్న ఒకతన్ని వేదిక మీదకు పిలిచి సెల్ఫీ ఇవ్వడం కొసమెరుపు.

మెయిన్ స్టేజీపై పాటలు, నృత్యాలు, శ్లోకాలు వంటి పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) మధ్యాహ్నం వరకు నిర్వహించారు. అనంతరం కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం ప్రోగ్రాం మొదలు పెట్టారు. అందరూ డెకొరేషన్ (Decoration) చేసిన ప్రదేశాలలో ఫోటోలు తీసుకుంటూ ఉల్లాసంగా కలియతిరిగారు.

సాయంత్రం మెయిన్ స్టేజ్ పై సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం టాలీవుడ్ నటి నేహా శెట్టి (Neha Shetty), సినీ హీరోస్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తదితరులను సన్మానించారు. ఆటా కార్యనిర్వాహక సభ్యులను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ని, కన్వెన్షన్ (Convention) వివిధ కమిటీల ఛైర్స్, కో-ఛైర్స్ తదితరులను వేదికమీదకు పిలిచి అభినందించారు.

టాలీవుడ్ డాన్స్ మాస్టర్ సత్య (Satya Master), నటీమణులు సౌమ్య, అంకిత, సరయు కలిసి వేసిన డాన్స్ ప్రోగ్రాంకి మంచి స్పందన వచ్చింది. తానా, నాట్స్, నాటా, టిటిఏ, టీడీఎఫ్, జిటిఏ, ఎన్నారై వాసవి వంటి జాతీయ సంస్థల (National Telugu Associations) ప్రతినిధులను ఆటా నాయకత్వం వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు.

ముఖ్య అతిథులు విజయ్ దేవరకొండ, నేహా శెట్టి, ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) చేతుల మీదుగా బ్యూటీ పాజెంట్ విజేతలకు, రన్నరప్స్ కి క్రౌన్స్ అందించారు. ఆటా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు (Lifetime Achievement Award) ని దాజి తరపున ప్రతినిధికి అందజేశారు.అలాగే ఆటా జీవన సాఫల్య పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు.

ఇండియా నుంచి విచ్చేసిన పరంపర ఫౌండేషన్ (Parampara Foundation) వారు ప్రదర్శించిన గుడి సంబరాలు నృత్యానికి సభికులందరూ నుంచొని మరీ కరతాళధ్వనులతో అభినందించారు. ఆటా (ATA) మొదటి మహిళా అధ్యక్షురాలు సంధ్య గవ్వ ఆధ్వర్యంలో ఆటా రెండవ మహిళా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ని మగువా మగువా ఈ లోకానికి… అంటూ నృత్యం చేసి మరీ అభినందించారు.

ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని మరియు కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం (Kiran Pasham) తమ సందేశం వినిపించారు. చివరిగా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ (SS Thaman) ట్రూప్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఒక టైం లో చిన్నలు, పెద్దలు అందరూ వేదిక ముందుకు వచ్చి డాన్సులు చేసి కేరింతలు కొట్టారు.

ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని (Madhu Bommineni) నాయకత్వంలో కిరణ్ పాశం కాన్ఫరెన్స్ కన్వీనర్ గా, శ్రీధర్ తిరుపతి కోఆర్డినేటర్ గా, సాయి సుధిని నేషనల్ కోఆర్డినేటర్ గా, అనీల్ బొద్దిరెడ్డి డైరెక్టర్ గా, ప్రశాంతి అసిరెడ్డి కోకన్వీనర్ గా, ప్రషీల్ గూకంటి కోకోఆర్డినేటర్ గా, శ్రీనివాస్ శ్రీరామ కోడైరెక్టర్ గా, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (ATA Board of Trustees) సహకారంతో 18వ మహాసభలు (ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్) విజయవంతంగా నిర్వహించారు.

18వ ఆటా (ATA) కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ మూడవ రోజుకి సంబంధించి మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/ATA 18th Convention & Youth Conference Day 3 in Atlanta ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected