వాషింగ్టన్ డీసీ లో జులై 1వ తేది నుండి 3వ తేది వరకు జరగనున్న ఆటా 17వ కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ సందర్భంగా, ఆటా కన్వెన్షన్ టీం ఆధ్వర్యంలో మే 28వ తేదీన విజయవంతంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మొత్తం 12 జట్లు పాలుపంచుకున్న ఈ టోర్నమెంట్ ని నాలుగు గ్రూపులుగా విభజించి ప్రతీ గ్రూప్ లొని 3 జట్లతొ ఈ పోటీలను నిర్వహించారు.
ప్రతీ గ్రూప్ లొ మొదట రెండు స్తానాల్లొ నిలిచినటువంటి జట్లు ప్లేఆఫ్ కు అర్హత సాధించాయి. హక్ష్-యేఐడబ్ల్యు జట్టు ఏసి/డీసి జట్టు పై విజయం సాధించి సెమిస్ నుండి ఫైనల్ కు చేరింది. వార్ రేంజర్స్ – యుసిసి జట్టు డీసిసి జట్టు పై విజయం సాందించి సెమిస్ నుండి ఫైనల్ కు చేరింది. ఉత్ఖంఠ భరితంగా జరిగనటువంటి ఫైనల్ మ్యాచ్ లొ హక్ష్-యేఐడబ్ల్యు జట్టు విజయం సాదించి 2022 ఆటా ఛాంపియన్షిప్ ని కైవసం చేసుకున్నారు.
మొదట టాస్ గెలిచిన హక్ష్-యేఐడబ్ల్యు జట్టు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుని ప్రత్యర్ధి జట్టుని 60 పరుగులకు కట్టడి చెయగలిగారు. వార్ రేంజర్స్ – యుసిసి జట్టు 10 ఒవర్స్ లొ 6 వికెట్ల నస్టానికి 60 పరుగులు చేసింది. 61 పరుగుల విజయలక్ష్యంతొ బరిలొకి దిగినటువంటి హక్ష్-యేఐడబ్ల్యు జట్టు 9.4 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి విజయం సాంధించింది.
క్లెమెంట్ తన అత్యత్భుత బ్యాటింగ్ నైపున్యంతొ 25 బంతులలొ 32 పరుగులు చేసి జట్టు విజయంలొ కీలక పాత్ర పొషించి మ్యాన్ ఆఫ్ మ్యచ్ గా నిలిచాడు. కేవలం ఒక్క రోజు లోనే ఉదయం 7:30 నుండి రాత్రి 10:30 వరకు ఈ పొటీలను ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ వారు విజయవంతంగా నిర్వహించారు.
ఏంతో ఉల్లాసంగా ఈ పొటీలలొ పాలుపంచుకున్న జట్లకు మరియు సహకరించిన మిత్రులకు ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ నిర్వాహకులు స్పోర్ట్స్ చైర్ సుధీర్ దామిడి, మహిళా స్పోర్ట్స్ చైర్ శీతల్ బొబ్బ మరియు వెండొర్ బూత్ కమిటి చైర్ కౌశిక్ సామ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ టోర్నమెంట్ లొ చందు (వార్ రేంజెర్- యుసిసి ) బెస్ట్ బ్యాట్స్మన్, ప్రసన్న (వార్ రేంజెర్- యుసిసి) బెస్ట్ బౌలర్, మురళి మాచిరాజు (హక్ష్-యేఐడబ్ల్యు) బెస్ట్ ఆల్రౌండర్ గా నిలిచారు. సెంటెర్విల్లె, హెరండొన్, రెస్టొన్ మరియు డుల్లెస్ గ్రౌండ్స్ లొ ఈ పొటీలు నిర్వహించబడ్డయి.