అక్టోబర్ 9వ తారీఖున అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ చికాగో టీం స్థానిక అరోరా బాలాజీ టెంపుల్ ప్రాంగణంలో నిర్వహించిన దసరా మరియు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఇల్లినాయిస్ 11 వ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ మ్యాన్ బిల్ ఫాస్టర్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో ౩5౦ మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల మధ్య జ్యోతి ప్రజ్వలన చేసి కాంగ్రెస్ మ్యాన్ బిల్ ఫాస్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికాలో ఇంజనీరింగ్, మెడికల్, వ్యాపార రoగాలలో తెలుగు వారు ఎంతో ప్రాముఖ్యాన్ని సాధించారు అని కాంగ్రెస్ మ్యాన్ బిల్ ఫాస్టర్ కొనియాడారు. అమెరికా సంతతికి చెందిన మిలియన్ పైగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఉత్సాహంతో తమ సంస్కృతి, పండుగలు జరుపుకోవటం శ్లాఘనీయం అని కొనియాడారు.
సాంప్రదాయ దుస్తులలో ముస్తాబైన మహిళలు, పిల్లలు బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు. మధు యాంకర్ గా వ్యవరించి ప్రేక్షకులని కండుపుబ్బా నవ్వించారు. సరితా నంద్యాల అండ్ టీం నిర్వహించిన కోలాటం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రుద్ర గర్జన అండ్ చికాగో చేతన గ్రూప్ వారు తమ వినూత్న డోలు వాయిద్యాలతో శ్రోతలను అలరించారు. మేళ తాళాలతో నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. డ్రోన్ కెమెరాతో నిమ్మజానం కార్యక్రమం చిత్రకరించారు. జమ్మి పూజ నిర్వహించి అందరికి ప్రసాదాలు అందించారు. స్పెషల్ రుచికరమైన వంటకాలు, తినుబండారాలు ఆహుతులని ఆహ్లాదింపచేశాయి.
బోర్డు అఫ్ ట్రస్టీ డాక్టర్ మెహర్ మేడవరం, ఆటా ట్రెషరర్ & ట్రస్టీ సాయినాథ్ రెడ్డి బోయపల్లి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటా ఆఫీస్ కోఆర్డినేటర్ మహీధర్ ముస్కుల తోడ్పాటుని అందించారు రీజినల్ కోఆర్డినేటర్స్ వెంకట్రామ్ రెడ్డి రావి, వెంకటేశ్వర రామిరెడ్డి మరియు సుచిత్ర రెడ్డి అన్ని తామై నడిపించిన ఈ కార్యక్రమానికి చల్మా రెడ్డి బండారు, వెంకట్ థుడి, మహిపాల్ వంఛ, భాను స్వర్గం, నరసింహ చిత్తలూరి, లక్ష్మి బోయపల్లి, కరుణాకర్ దొడ్డం, అమరేంద్ర నెట్టం, రమణ అబ్బరాజు, సతీష్ యెల్లమిల్లి, విశ్వనాధ్ చిత్ర, హరి రైని, జగన్ బుక్కరాజు మరియు భీమి రెడ్డి తోడ్పాటుని అందించారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, ప్రెసిడెంట్-ఎలెక్ట్ మధు బొమ్మినేని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకి దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియచేసారు.
బతుకమ్మలు పేర్చటానికి సుచిత్ర రెడ్డి, పద్మ ముస్కుల, దీప్తి వంచా, వైశాలి రావి, తులసి రెడ్డి, హారతి థుడి, అపర్ణ కొల్లు, లావణ్య గుండు, నందిని బుక్కరాజు, దీపికా నమసాని, స్వాతి రావ్, ఆశ తుళువ, సుప్రీతా కేశవరావు , ప్రసూనా రెడ్డి ఓరుగంటి, సుధా కుందూరు, అనిత కొప్పర, ఆశ రెడ్డి పాశం, మల్లేశ్వరి పెద్ధమల్లు మరియు సరితా చల్ల సహకారం అందించారు. రాఫుల్ టికెట్స్ మరియు బతుకమ్మ విజేతలకు బహుమతుల ప్రధానం గావించారు. కార్యక్రమం విజయవంతం కావటానికి సహకారం అందించిన స్పాన్సర్స్, లోకల్ ఆర్గనైజషన్స్ మరియు వాలంటీర్స్ కు ఆటా చికాగో టీం సభ్యులు ధన్యవాదాలు తెలియచేసారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ వెబ్ మీడియా మిత్రులకు, ప్రకటనకర్తలకు ఆటా మీడియా చైర్ భాను స్వర్గం ధన్యవాదాలు తెలియచేసారు.