Connect with us

Convention

ఉల్లాసభరితంగా ‘ఆటా’ క్యారం బోర్డ్ పోటీలు: వర్జీనియా

Published

on

ATA కన్వెన్షన్ టీమ్, USCA (యునైటెడ్ స్టేట్స్ క్యారమ్స్ అసోసియేషన్) మరియు CACA (క్యాపిటల్ ఏరియా క్యారమ్స్ అసోసియేషన్) సహాయంతో మే 15న Ashburn హిల్టన్ గార్డెన్ లో క్యారమ్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఛాంపియన్ విభాగంలో “ఆదిలాబాద్ నైట్స్” జట్టు టైటిల్ గెలుచుకోగా, చిత్తూరు పుష్ప జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఛాలెంజర్స్ డివిజన్‌లో గుంటూరు మిర్చీ జట్టు టైటిల్ గెలుపొందగా, తిరుపతి టైగర్స్ 2వ స్థానంలో నిలిచింది.

ATA బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అండ్ కన్వెన్షన్ అడ్వైజరీ చైర్ జయంత్ చల్లా మరియు కన్వెన్షన్ కోఆర్డినేటర్ రవి చల్లా ఈ కార్యక్రమానికి హాజరై విజేతలను అభినందించారు. ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ATA బృందం ప్రతి ఒక్కరు ఇదే ఉత్సాహంతో మిగిలిన క్రీడలు మరియు సమావేశాల వరకు వరుసలో ఉన్న కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

స్పోర్ట్స్ చైర్ సుధీర్ దామిడి ATA కన్వెన్షన్ మీడియా టీం కి మరియు అద్భుతమైన మద్దతునిచ్చిన వాలంటీర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్థానిక రెస్టారెంట్ “కంట్రీ ఓవెన్” ఈ క్రీడా ఈవెంట్‌ల కోసం ఆహారాన్ని స్పాన్సర్ చేసింది. Local Coordinator శ్రవణ్ పాడురు, మీడియా కమిటీ చైర్ రాము ముండ్రాతి మరియు కో చైర్‌ సునీల్ కుడికల, హాస్పిటలిటి కమిటీ చైర్ అమర్ పాశ్య మరియు సుధీర్ దామిడి స్పోర్ట్స్ చైర్, శ్రీధర్ బండి స్పోర్ట్స్ కో-చైర్, శీతల్ బొబ్బా మహిళా స్పోర్ట్స్ చైర్ టీమ్‌ విజేతలను అభినందించి బహుమతులు అందించారు.

టైటిల్ గెలుచుకున్న”ఆదిలాబాద్ నైట్స్” జట్టు కెప్టెన్ మరియు క్యారం బోర్డ్ నిర్వహకులు రాజేంద్ర గొడుగు ఒకరే కావటం గమనర్హం. ఈ కార్యక్రమాలను సుధీర్ దామిడి స్పోర్ట్స్ చైర్, శ్రీధర్ బండి స్పోర్ట్స్ కో-చైర్, శీతల్ బొబ్బా మహిళా స్పోర్ట్స్ చైర్ విజయవంతంగా నిర్వహించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected