Connect with us

Beauty Contest

ఆటా బ్యూటీ పాజంట్ 2022: అందాల పోటీలు

Published

on

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ అధ్యక్షులు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు మరియు అన్ని కమిటీల సభ్యులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డిసి లో జులై 1-3 వరకు జరగనున్న ఆటా 17వ మహాసభలను పెద్ద ఎత్తున పదివేల మందికి పైగా హాజరయ్యె విధంగా సన్నాహాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ మహాసభలను పురస్కరించుకొని ఆటా బ్యూటీ పాజంట్ 2022 అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. 13 నగరాలలో 8 వారాలపాటు టీన్, మిస్, మిస్సెస్ ఆటా బ్యూటీ పాజంట్ పోటీలు నిర్వహిస్తున్నారు. 17వ ఆటా కన్వెన్షన్ వేదికగా జూలై 1 నుంచి 3వ తేదీ వరకు వాల్టర్‌ ఇ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రముఖ జడ్జిల సమక్షంలో స్టార్ సెలెబ్రెటీస్ చేతుల మీదుగా క్రౌన్ ప్రజంటేషన్ ఉంటుంది.

బ్యూటీ పాజంట్ అమెరికాలోని వర్జీనియా, న్యూ జెర్సీ, డెలావేర్, షార్లెట్, ర్యాలీ, అట్లాంటా, నాష్విల్, డెట్రాయిట్, చికాగో, డల్లాస్, పోర్ట్లాండ్, సియాటిల్, లాస్ ఏంజలెస్ నగరాల్లో నిర్వహిస్తారు. మీ ఆడిషన్ ఎంట్రీ www.ataconference.org/events-registrations లో రిజిస్టర్ చేసుకోండి. అలాగే మహాసభల వివరాలకు www.ataconference.org ని సందర్శించండి.

error: NRI2NRI.COM copyright content is protected