Connect with us

News

బతుకమ్మ సంబరాలలో ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని @ Raleigh, North Carolina

Published

on

నార్త్ కరోలినా రాష్ట్రం, రాలీ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని (Madhu Bommineni) పాలుపంచుకున్నారు. దాదాపు 150 మందికి పైగా పాల్గొన్న ఈ ప్రైవేట్ కార్యక్రమంలో మధు బొమ్మినేని మాట్లాడుతూ.. అమెరికాలో ఆటా ఆధ్వర్యంలో ఎన్నో నగరాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు.

అమెరికా తెలుగు సంఘం (American Telugu Association) కార్యవర్గం తరపున మహిళలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియచేసారు. 2024 జూన్ 7 – 9 తారీకులలో అట్లాంటా (Atlanta) లో జరుగనున్న 18th ఆటా కన్వెన్షన్ (Convention) లో అందరూ పాల్గొని ఈ మహా సభలను విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected