పండుగ లాంటి 3 రోజుల ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ నిన్న జూన్ 7 బాంక్వెట్ డిన్నర్ తో కోలాహలంగా ప్రారంభమయ్యాయి. 12 ఏళ్ళ తర్వాత ముచ్చటగా మూడోసారి అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా (Atlanta) మహానగరంలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ (Georgia World Congress Center) లో నవత, యువత, భవిత ధ్యేయంగా ఈ 18వ ఆటా మహాసభలు మొదలయ్యాయి.
ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని నాయకత్వంలో కిరణ్ పాశం (Kiran Pasham) కాన్ఫరెన్స్ కన్వీనర్ గా, శ్రీధర్ తిరుపతి కోఆర్డినేటర్ గా, సాయి సుధిని నేషనల్ కోఆర్డినేటర్ గా, అనీల్ బొద్దిరెడ్డి డైరెక్టర్ గా, ప్రశాంతి అసిరెడ్డి కోకన్వీనర్ గా, ప్రషీల్ గూకంటి కోకోఆర్డినేటర్ గా, శ్రీనివాస్ శ్రీరామ కోడైరెక్టర్ గా, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (ATA Board of Trustees) సహకారంతో 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.
అమెరికా (USA) కాలమానం ప్రకారం జూన్ 7, శుక్రవారం సాయంత్రం సుమారు 6 గంటలకు ఆటా (American Telugu Association) నాయకులు, ఆటా సభ్యులు, స్థానిక ప్రవాసులు, ఇండియా నుంచి వచ్చిన సెలబ్రిటీస్ (Celebrities) రాకతో వేదిక ప్రాంగణం కళకళలాడింది.
రెజిస్ట్రేషన్ మరియు తేనీటి విందు అనంతరం అందరూ మెయిన్ హాల్లో ఆసీనులవగా వేదికపై జ్యోతి ప్రజ్వలనతో అమెరికా తెలుగు సంఘం (ATA) 18వ మహాసభలను ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని (Madhu Bommineni) ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) ఆకట్టుకున్నాయి.
విద్య, వ్యాపార, ఆరోగ్య, సామజిక సేవ వంటి వివిధ రంగాలలో సేవలందించిన ప్రముఖులకు అవార్డ్స్ (Awards) ప్రధానం చేశారు. అలాగే దాతలను, గత 2021-22 కాలానికి చెందిన ఆటా (American Telugu Association) కార్యవర్గాన్ని వేదికపై ఘనంగా సన్మానించారు.
ఈ బాంక్వెట్ డిన్నర్ (Banquet Dinner) కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి & దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలుగు సినీ హీరో శ్రీకాంత్, టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ మెహ్రీన్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, తమ్మారెడ్డి భరద్వాజ్, ఎమ్మెల్యేలు, పలువురు టీవీ మరియు సినిమా నటీనటులు పాల్గొన్నారు.
తానా, నాట్స్, నాటా, టిటిఏ, టీడీఎఫ్, జిటిఏ, ఎన్నారై వాసవి వంటి జాతీయ మరియు తామా, గాటా, గేట్స్ వంటి స్థానిక తెలుగు సంస్థల (Telugu Associations) ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. మహిళలు, పెద్దలు సెలబ్రిటీస్ తో ఫోటోలు దిగుతూ సందడిగా కనిపించారు.
ఒక పక్క ఈ బాంక్వెట్ డిన్నర్ (Banquet Dinner) కార్యక్రమం నడుస్తుండగా, సమాంతరంగా యువత కోసం ప్రత్యేకంగా బాల్ రూమ్ లో ఏర్పాటుచేసిన యూత్ కన్వెన్షన్ (Youth Convention) లో యువత తమ తమ ఆహ్లాదకరమైన కార్యక్రమాలతో సంతోషంగా గడిపారు. వీరికి ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేయడం విశేషం.
ఇలా వరుస కార్యక్రమాలతో మూడు రోజుల ఆటా పండుగ (18th ATA Convention & Youth Conference) లో మొదటిరోజుని విజయవంతంగా ముగించారు. వందన సమర్పణలో భాగంగా డోనార్స్ కి, స్పాన్సర్స్ కి, అతిథులకి, ఆహ్వానితులకి, వాలంటీర్స్ కి ఇలా ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు (Vote of Thanks) తెలియజేశారు.
బాంక్వెట్ డిన్నర్ కోసం ప్రత్యేకంగా విందు భోజనం ఏర్పాటుచేశారు. చివరిగా టాలీవుడ్ సంగీత దర్శకులు (Tollywood Music Director) అనూప్ రూబెన్స్ (Anup Rubens) లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ (Live Musical Concert) అందరినీ అలరించింది. దీంతో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే ఆటా (ATA) మహాసభలకు గ్రాండ్ కిక్ ఆఫ్ ఇచ్చినట్లయింది.
18వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కి సంబంధించి మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/ATA 18th Convention & Youth Conference in Atlanta ని సందర్శించండి. మిగతా రెండు రోజుల కార్యక్రమాల వివరాల కోసం www.NRI2NRI.com/ATA 18th Convention Program Guide ని సందర్శించండి.