Connect with us

Associations

అంగరంగవైభవంగా ‘ఆటా’ 17వ మహాసభల కిక్ ఆఫ్ ఈవెంట్

Published

on

వాషింగ్టన్ డీసీ లో అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ 17వ మహాసభలు నిర్వహించనున్నారు. వచ్చే సంవత్సరం 2022 జులై 1 నుండి జులై 3 వరకు వాషింగ్టన్ డీసీ లోని వాల్టర్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించడానికి ఈరోజు ప్లానింగ్ ఈవెంట్ కిక్ ఆఫ్ చేసారు.

వర్జీనియాలోని హెర్న్ డన్ లో జరిగిన ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ కి అమెరికా నలుమూలలనుంచి ఆటా గత మరియు ప్రస్తుత లీడర్షిప్ హాజరయ్యారు. అంగరంగవైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రస్తుత ప్రెసిడెంట్ భువనేశ్ బూజల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని, అలాగే అట్లాంటా నుంచి గత ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి, కాన్ఫరెన్స్ యాడ్హాక్ మరియు కోర్ కమిటీ సభ్యులు కిరణ్ పాశం, కాన్ఫరెన్స్ అడ్వైజరీ కమిటీ సభ్యులు గౌతమ్ గోలి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఏబిఆర్ టీవీ ఫౌండర్ మరియు సీఈఓ అనిల్ బోదిరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వేణు పిసికే తదితరులు హాజరయ్యారు. కోవిడ్ తరువాత నిర్వహించే కన్వెన్షన్ అవ్వడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected