Connect with us

Government

మన్నవ మోహన కృష్ణ ఆధ్వర్యంలో శకటాల భారీ ర్యాలీతో వినూత్నంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు @ Guntur, Andhra Pradesh

Published

on

Guntur, Andhra Pradesh: ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) గారి ఆధ్వర్యంలో విన్నుత్న కార్యక్రమం – నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారి ఆధ్వర్యంలో విన్నుత్నంగా వివిధ శకటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

నారా లోకేష్ (Nara Lokesh) గారు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి శాసనసభ్యుడిగా, రాష్ట్ర విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు సాధించిన విజయాలను, చేసిన అభివృద్ధిని చాటి చెప్తూ ఒక్కొక్క శకటంలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా – యువగళం పాదయాత్ర, కోటి సభ్యత్వాలు, కార్యకర్తలకు 5 లక్షల భీమా, నిరంతర ప్రజా దర్బారులు…

మంగళగిరి (Mangalagiri) శాసనసభ్యుడిగా – 39 ఏళ్ళ తరువాత మంగళగిరిలో తెలుగుదేశం గెలుపు, రికార్డు మెజారిటీ, మంగళగిరి లో 3000 ఇళ్ల పట్టాల పంపిణి, 100 పడకల ఆసుపత్రి, మోడల్ లైబ్రరీ, మోడల్ స్కూల్, పార్కులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో మంగళగిరిని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ధటం.

విద్యామంత్రిగా – 16,437 ఉపాధ్యాయ పోస్టులను మెగా డీఎస్సీ (Mega DSC) ద్వారా భర్తీ చెయ్యటం, విద్యా మంత్రిగా ఎన్నో సంస్కరణలు, మార్పులు – పేరెంట్స్ టీచర్స్ మీట్, నో బ్యాగ్ డే, రాజకీయ పార్టీ రహిత యూనిఫామ్, ప్రతి నియోజకవర్గంలో మోడల్ స్కూల్ ఏర్పాటు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచితంగా కోచింగ్, స్టడీ మెటీరియల్, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్లు …

ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా – వాట్సాప్ గవర్నెన్స్, 15 Billion Dollars పెట్టుబడితో విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. IBM, Microsoft, TCS, Accenture, Cognizant తదితర దిగ్గజ కంపెనీలతో పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పని చెయ్యటం..త్వరలో అమరావతి (Amaravati) లో క్వాంటం వాలీ…

ఇలా నారా లోకేష్ (Nara Lokesh) గారు తీసుకొచ్చిన ప్రగతిని, సాధించిన విజయాలను, చేసిన అభివృద్ధిని ప్రజలకు చాటి చెప్పేవిధంగా ప్రతి శకటంలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. గుంటూరు (Guntur) లోని వివిధ ప్రాంతాల గుండా జరిగిన ఈ శకటాల రాలీ ప్రజలను విశేషంగా ఆకర్షించింది, ప్రజలు ఆసక్తిగా ఈ ర్యాలీని తిలకించారు.

ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshmi Narayana) గారు, నక్కా ఆనందబాబు గారు, శాసన సభ్యులు మొహమ్మద్ నసీర్ గారు, బూర్ల రామాంజనేయులు గారు, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్య రావు గారు, నగర్ మేయర్ కోవెలముడి రవీంద్ర (Kovelamudi Ravindra) గారు..

రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబధయ్య గారు (Nandam Abadhayya), రాష్ట్ర ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ గారు, డిప్యూటీ మేయర్ సజీల గారు, గళ్ళా రామచంద్రరావు గారు, పెద్ధ సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఇంత విన్నూత్నంగా నారా లోకేష్ గారి జన్మదినాన్ని నిర్వహించిన మన్నవ మోహన కృష్ణ గారిని అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected