Connect with us

Business

ఆప్త సభ్యులు కాదు, నా ఆప్తులు; నా సంపాదన పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌ లే: చిరంజీవి @ APTA Katalyst Global Business Conference in Hyderabad

Published

on

కనెక్ట్‌, కొలాబరేట్‌, క్రియేట్‌ (Connect, Collaborate, Create) అంటూ హైదరాబాద్‌ (Hyderabad, Telangana) లోని హైటెక్స్‌ (HITEX Exhibition Centre) లో గత మూడు రోజులుగా అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ ‘ఆప్తక్యాటలిస్ట్‌ గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ (పెట్టుబడిదారుల ప్రపంచ వ్యాపార సదస్సు – APTA Katalyst – Global Business Conference) నిర్వహిస్తున్నారు.

ఆదివారం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి (Konidela Sivasankara Varaprasad) హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయడానికి దమ్ము కావాలని, అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆప్త (American Progressive Telugu Association – APTA) నాయకులు కార్యక్రమం నిర్వహించిన తీరు అభినందనీయం అన్నారు.

మీరందరూ ఆప్త సభ్యులు కాదు, నా ఆప్తులు. కొన్ని చోట్లకి మొక్కుబడిగా వెళతాం, కానీ ఇక్కడికే వస్తే నా కుటుంబ సభ్యులతో ఉన్న అనుభూతి కలుగుతుందన్నారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ జీవితంలో ఎదిగాను. వీటిని మీరు మీ బిజినెస్ మైండ్ కి తగ్గట్టు అన్వయించుకోండి అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).

అలాగే కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఏదో సాధించాలనే తపన 8వ తరగతిలోనే మొదలైందని, ఫొటోలు పట్టుకొని సినిమా అవకాశాల కోసం వెళ్లలేదని, ఫిలిం ఇనిస్టిట్యూట్‌ నుంచే అవకాశాలు వచ్చాయని, జీవితంలో తను సంపాదించింది తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), కుమారుడు రామ్‌చరణ్‌ (Ram Charan) లనేనని చిరంజీవి తెలియజేశారు.

‘అన్‌లాకింగ్‌ గ్రోత్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ త్రూ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ’ అనే అంశంపై చర్చలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కందుల దుర్గేశ్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం తమ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. తీర ప్రాంతంలో బీచ్‌, రిసార్ట్‌ టూరిజం తోపాటు టెంపుల్‌, ఎకో, ఎడ్వెంచర్‌, సాహిత్య టూరిజం (Tourism) వంటి అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు.

చిన్నబుచ్చుకున్న AP మంత్రి కందుల దుర్గేశ్‌

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి కందుల దుర్గేశ్‌ పలు విధానాలు గురించి వివరిస్తుండగా.. ఆప్త (APTA) నాయకులు ప్రసంగాన్ని త్వరగా ముగించాలని కోరడంతో మంత్రి దుర్గేశ్‌ (Kandula Lakshmi Durgesh Prasad) చిన్నబుచ్చుకున్నారు. తనకు ముందుగానే ప్రోగ్రాం లైనప్ చెప్పి ఉంటే సమయానికి ముగించేవాడినంటూ వేదిక వేగంగా దిగి వెళ్లిపోయారు. కొందరు ఆయనకు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినకుండా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (Telangana State Chief Minister Anumula Revanth Reddy), కాంగ్రెస్ పార్టీ నాయకులు వి హనుమంతరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు కె లక్ష్మణ్, ప్రముఖ నటి నిహారిక (Niharika Konidela), నిర్మాతలు, టెక్ దిగ్గజాలు, ఆప్త నాయకులు, సభ్యులు, పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected