Connect with us

News

హైదరాబాద్ లో దిగగానే ఆంధ్రప్రదేశ్ పోలీసుల కస్టడీకి NRI Yash Bodduluri

Published

on

అమెరికాలోని వాషింగ్టన్ డీసీ (Washington DC) లో సాఫ్టువేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసుకుంటూ భార్యాపిల్లలతో నివసిస్తున్న యశస్వి బొద్దులూరి (Yash Bodduluri), అనారోగ్యంతో ఉన్న తన తల్లి ని పరామర్శించడానికి ఇండియా (India) వెళ్లారు.

ఈ రోజు హైదరాబాద్ విమానాశ్రయం (Hyderabad Airport) లో దిగీ దిగగానే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు (Andhra Pradesh CID) కస్టడీ లోకి తీసుకొని రోడ్డు మార్గం ద్వారా మంగళగిరి డిజిపి ఆఫీసుకు విచారణ కోసం తరలిస్తున్నట్టు ఈ వీడియోలో ప్రస్ఫుటంగా తెలుస్తుంది.

స్వతహాగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అభిమాని అయిన యశస్వి బొద్దులూరి ప్రవాసంలో ఉండి కూడా, రాష్ట్రం పట్ల బాధ్యతగల పౌరుడిగా నిత్యం రాష్ట్రంలో జరిగే పరిణామాలమీద తన అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో నిర్భయంగా వెలిబుచ్చుతుంటారు.

ఈ విషయంలోనే కస్టడీ లోకి తీసుకొని ఉండవచ్చని తన స్నేహితులు అంటున్నారు. ఈ సందర్భంగా అతని మిత్రులు అప్రజాస్వామిక నిర్బంధాన్ని ఖండిస్తున్నామని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉయ్ స్టాండ్ విత్ యష్ బొద్దులూరి (Yash Bodduluri) అంటూ సోషల్ మీడియాలో మద్దతుగా నిలుస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected