Connect with us

Politics

Hamburg, Germany: NDA కూటమి ప్రభుత్వ ఏడాది వేడుకలు, హాజరైన మహిళలు, యువత

Published

on

Hamburg, Germany : కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేసిందని శ్రీనివాస్ వడ్డాది (Srinivas Vaddadi) అన్నారు. జర్మనీ (Germany) లోని హోంబర్గ్ (Hamburg) పట్టణంలో ఎన్ఆర్ఐ టీడీపీ (NRI TDP) ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. హాంబర్గ్ (Hamburg) తెలుగు కమ్యూనిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వడ్డాది (Srinivas Vaddadi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ముందుగా ఎన్టీఆర్ (NTR) విగ్రహానికి నివాళులు అర్పించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ (P. Narayana) జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు శశిధర్ ఏమిరెడ్డి (Shashidhar Amireddy), డా.శివ శంకర్ లింగం (Dr. Shiva Shankar Lingam) అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ (Srinivas) మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల అప్రమత్తంగా వ్యవహరించి విధ్వంసకారులకు తగిన గుణపాఠం చెప్పారు.

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల మందిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. శశిధర్ ఏమిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు.

ఏడాదిలోనే బాబు సూపర్ సిక్స్ హామీలను దాదాపుగా నెరవేర్చారన్నారు. ఎన్టీపీసీ (NTPC), ఆర్సెల్లార్ మిట్టల్ (ArcelorMittal), రిలయన్స్ సీబీజీ (Reliance CBG), బీపీసీఎల్ (BPCL), టీసీఎస్ (TCS), ఓర్వకల్లు (Orvakallu), కొప్పర్తి (Kopparthi) పారిశ్రామికవాడల ద్వారా రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుందన్నారు. డాక్టర్ శివశంకర్ లింగం (Dr. Sivashankar Lingam) మాట్లాడుతూ.. దేశం గర్వించేలా అమరావతి (Amaravati) ప్రజారాజధానిని కూటమి ప్రభుత్వం వేగంగా నిర్మిస్తోందన్నారు. ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో మహిళలు, యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హాంబర్గ్ టీడీపీ నేతలు (Hamburg TDP leaders), విక్రమ్ తల్లపనేని (Vikram Tallapaneni), దినేష్ పాకలపాటి (Dinesh Pakalapati), కిషోర్ దాసుగారి (Kishore Dasugari), అఖిల్ ప్రసన్న దున్న (Akhil Prasanna Dunna), శ్రీకాంత్ గోళ్ళ (Srikanth Golla), భరత్ శీలంనేని (Bharat Seelamneni), ఉజ్వల్ మారెడ్డి (Ujwal Mareddy), హాంబర్గ్ తెలుగు కమ్యూనిటీ (Hamburg Telugu Community) సభ్యులు అంకారావు (Ankara Rao) తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected