Connect with us

Telugu Desam Party

Jacksonville, Florida: ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం: MLA Vasantha Krishna Prasad

Published

on

Jacksonville, Florida: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించాలని ప్రవాసాంధ్రుల్ని కోరారు. జగన్ అరాచకం నుండి అభివృద్ధి వైపు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పరుగులు పెడుతోందని వెల్లడించారు.

ది.02.07.2025 ఫ్లోరిడా (Florida) రాష్ట్రంలోని జాక్సన్ విల్లే నగరంలో కూటమి ప్రభుత్వం యేడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు ఎన్టీఆర్ (NTR) సినీ రంగ ప్రవేశం చేసి 75 వసంతాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని వసంత మాట్లాడుతూ… రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి పారిశ్రామిక అభివృద్ధి జరిగితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. జగన్ అనే భూతాన్ని చూసి ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ప్రవాసాంధ్రులు పీ4లో భాగస్వాములు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి…. అని పిలుపునిచ్చారు.

గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) మాట్లాడుతూ… గత ప్రభుత్వం కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలు రాష్ట్రం వదిలి పోయేటట్టు చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీలు రాష్ట్రానికి, అన్ని వర్గాలకు మేలు చేసేవని పేర్కొన్నారు.

“అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అనేక ప్రపంచ రికార్డులను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సొంతం చేసుకుంది. చంద్రబాబు అకుంఠిత దీక్షతోనే ఇది సాధ్యపడింది. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ జరుపుకుంటున్నారు. జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి లభించింది. గత ప్రభుత్వ హయాంలో కూల్చివేతలే తప్ప కట్టడాలు లేవు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని శిథిలం నుండి శిఖరం వైపుకు తీసుకెళ్తోంది” అని అన్నారు.

జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం మొదలయ్యింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధిపై తయారు చేసిన సీడీలను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సుమంత్ ఈదర (Sumanth Eedara), ఆనంద్ తోటకూర (Anand Thotakura), అనిల్ యార్లగడ్డ (Anil Yarlagadda), ఆనంద్ వక్కలగడ్డ (Anand Vakkalagadda), హరీశ్ కుమార్ వీరవల్లి (Harish Kumar Veeravalli), రాజేశ్ మాదినేని (Rajesh Madineni), గోపాల్ కుంట్ల (Gopal Kuntla), నాగేశ్వరరావు సూరి (Nageswara Rao Suri) తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected