Published
5 months agoon
By
NRI2NRI.COMఆంధ్రప్రదేశ్ లో మొత్తం పంచాయతీలు – 13,326
గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ – 49 రకాల పనులు.
వ్యవసాయ అనుబంద పనులు – 38 రకాల పనులు.
ఎన్.డి.ఎ పభుత్వం మంజూరు చేసిన నిధులు – రూ.4500 కోట్లు
9 కోట్ల పనిదినాలు.
54 లక్షల కుటుంబాలకు ఉపాది.
ఈరోజు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వేసిన అడుగు దేశవ్యాప్తంగా ఒక రికార్డ్. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఒకేసారి 13,326 పంచాయితీలలో గ్రామసభలను నిర్వహించడం. అందులో ఆయన స్వయంగా మైసూరా వారి పల్లె గ్రామ సభలో పాల్గొనడం, తీర్మానలు చెయ్యడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి. మైసూరా వారి పల్లె ఎంచుకోవడంలో ప్రత్యేకత: 2021లో నాటి అవినీతి పాలనకు ఎదురొడ్డి పోరాడిన జనసేన వీర మహిళ శ్రీమతి సంయుక్త గారు జనసేన పార్టీ (Jana Sena Party) తరుపున ఎన్నికైన సర్పంచ్. నాడు చెల్లికి ఇచ్చిన మాటకోసం నేడు పయనమైన పవన్ కళ్యాణ్ గారు (మైసూరా వారి పల్లె, రాయలసీమలో రైల్వే కోడురు నియోజకవర్గ పరిదిలో ఉన్నది).
మైసూరావారి పల్లి గ్రామసభలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రసంగంలో ముఖ్యాంశాలు:
1) ప్రతీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ చదివితే, ఆమె ఇంటికి, పల్లెకు, పట్టణానికి, రాష్ఠాని మొత్తం దేశానికే వన్నె తెస్తుంది అని చెప్తూ అందుకు ఉదాహరణగా మన రాష్ఠపతి శ్రీమతి ద్రౌపధి ముర్ముర్ గారు గురించి చక్కగా చెప్పారు. ఒక సర్పంచ్ నుండి రాష్ఠపతి వరకు ఆమె ప్రయాణమే నేటి మహిళలకు స్పూర్తి.
2) పౌర హక్కుల సమాచార చట్టం ప్రకారం ప్రతీ పని తాలుక పని వివరాలు బోర్డ్ పెట్టలని, ఆ పని ఆయ్యే వరకు మీరంతా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. దీనిలో కాంట్రక్టర్ తాలూకా వివరాలు, అమోదించబడిన బడ్జెట్ వివరాలు పొందుపరచాలని అధికారులను కోరారు. ఎన్ని లేయర్ల రోడ్ వేసారో లాంటి వివరాలు పెట్టలని అది ప్రజలు కూడా పరిక్షించాలని అప్పుడే మన పంచాయితీ నిధులు సద్వినియోగ పడతాయి అని అన్నారు.
3) శక్తిని కొంతమందికే దార పోస్తారా? లేదా మీ గ్రామాలకు మీరే బాద్యత తీసుకొంటారా?? అని సూటిగా ప్రశ్నించడమే కాదు. పనులు జరగకపోతే నిలదియ్యమన్నారు.
3) డబ్బులు లేకుండా గ్రామ సభలు పెట్టడం ఏంటని నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు సుమారు 70% వైసిపి వాళ్ళు సర్పంచులుగా ఉన్నారు. వారిని అడగండి, పంచాయితీలో డబ్బులు పడ్డాయో లేదో అని.
4) యువతని ఉద్ద్దేశించి సినిమా ఒక్క ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన, దేశం మీద ప్రేమ ఉండాలి. మన ఇంట్లో అమ్మకి, అక్కకి, చెల్లికి, వదినకి మనం అండగా నిలబడాలి. యువత బైటికి రావాలి. పల్లెలే పట్టణానికి పట్టుకొమ్మలు. ముందస్తూగా పంచాయితీ నుండే మీరు నాయకత్వ పఠిమను పెంచుకొండి. భవిష్యత్తులో మీరే ఈ రాష్ఠానికి (Andhra Pradesh) నాయకులు అవుతారు.
5) అన్న హజారే (Anna Hazare) అంటే నాకు చాలా ఇష్ఠం. అన్నయ్య చిరంజీవి (Megastar Chiranjeevi) గారు నటించిన రుద్రవీణకి ఆయనే స్పూర్తి. రేలేగావ్ సిద్ది గ్రామానికి ఆయన చేసిన సేవలు, దీని ద్వారా మొత్తం దేశాన్నే కదిలించగలిగారు అని గొప్పగా కొనియాడారు.
మైసూరా వారి పల్లెకు ఇచ్చిన హామీలు
యువ శక్తి: నవ్వుపోయిన నవ్వ్యాంద్రాకి యువత కధం తొక్కి ఈరోజు నేటి సమాజానికి మీరు ధైర్యం ఇచ్చారు. పదివేల మంది మాలాంటి నాయకులు వచ్చిన, ఒక్కసారి మీరు రోడ్ ఎక్కితే ఈదేశం దశ దిశ నిర్దేశిస్తారు.
సైబర్నెట్ కనెక్టివిటి: గ్రామాలలో బ్రాడ్ బేండ్ కల్పించడం ద్వారా ఇక్కడి విద్యార్ధికి, నైపుణ్యం కలిగిన వారికి భాష అడ్డంకి కాకూడని మన భాషలో కూడా సాఫ్ట్వేర్ ప్రధాన మంత్రిగారి పధకం ద్వారా అందుకోవాలి. మనం డిజిటల్ ఇండియా (Digital India) దిశగా అడుగులు వెయ్యాలని చెప్పారు.
స్వర్ణ పంచాయితి: భవిష్యత్తులో ప్రతీ పంచాయితి ఒక సెల్ఫ్ గవర్నమెట్ యూనిట్ గా కావాలి. స్వయం పరిపాలన చేసుకొనే శక్తి ప్రతీ గ్రామానికి ఉండాలి.
నారీ మేదస్సు: శ్రీమతి పగడాల లక్ష్మి గారు మాటలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ప్రేరణ కల్పించాయి. శ్రీమతి లక్ష్మి గారు మా గ్రామంలో చాలామంది ఉపాది కోసం పక్క రాష్ఠాలకు వెళ్ళిపోతున్నారు. అదే ఇక్కడ మాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది కదా అని అన్నారు. నా ఆడబిడ్డ అడిగింది అంటే, దీన్ని ప్రత్యకంగా తీసుకొని ఆ దిశగా పనిచేస్తాము అని మాట ఇచ్చారు. మహిళలు మీరు అనుకోబట్టే 164 అసెంబ్లీ స్థానాలను ఈరోజు కూటమి గెల్చుకోగలిగింది. మీరు బలం ఇవ్వబట్టే మేము సుమారు 940కోట్లు నిన్న ఎకౌంట్స్ లో వెయ్యగలిగాము. అది మీరు ఇచ్చిన బలం. మహిళలందరికి నా హృదయపూర్వక నమస్కారాలు.
ఏదైనా కావాలంటే అడగాలి: శ్రీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారి మాటల్లో మనకి ఏదైనా కావలంటే అడగాలి అని చెప్తూ ఉదాహరణగా అపిల్ వ్యవస్తాపకులు స్టీవ్ జాబ్స్ ఆయన చిన్నప్పుడు ఏదో నేర్చుకొన్నప్పుడు ఒక సర్క్యూట్ బోర్డ్ కావలసి వచ్చింది. వెంటనే ఆయన ఐ.బి.ఎం ఓనర్ కి కాల్ చేసి అడిగారు. వెంటనే ఆయన స్టీవ్ జాబ్స్ కావల్సిన సర్క్యూట్స్ పంపించారు అంట. ఎంతమంది ముందుకు వస్తారో తెలియదు గాని, ముందు మనం కావాలంటే అడగడానికి మొహమాటపడవద్దు.
మచ్చుతునక: పంచాయితి సొమ్ము 8 సెంట్లు అని తెలుసుకొని, నాకున్న దాంట్లో 10 సెంట్లు ఇస్తాను అని ముందికి వచ్చిన శ్రీ కారుమంచి నారాయణ గారిని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకొని చెప్పిన మాటలు మనందరిని ఆలోచింప చేసాయి. మీరు ఇచ్చిన భూమిని సద్వినియోగం చేసుకొంటాం. అదే ప్రారంభోస్తవం రోజు నేను వస్తాను, అలాగే రాష్టం అంతా మీకు గుర్తింపు వచ్చేలా చేసే బాద్యత నాది అని చెప్పారు. ఇప్పటిదాక అందరూ నన్ను ఫొటో అడిగారు, నాకు కారుమంచి నారాయణ గారితో ఒక ఫొటో కావాలని అడిగి మరీ ఫొటో తీయించుకొన్నారు.
గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి: భారతదేశానికి (India) శాంతి, స్వపరిపాలనతో కూడిన అభివృద్ధి అవసరం అని గాంధీజీ అన్నారు. గ్రామాన్నే ఒక రిపబ్లిక్ గా చెయ్యాలన్నారు. శాసనసభ, పార్లమెంట్ లాగ గ్రామసభ కూడా ప్రజావసరాలను తీర్చే వ్యవస్థ. గ్రామాలు పచ్చగా ఉంటే, దేశం పచ్చగా ఉంటుందన్నారు.గ్రామ పరిపాలన మానవీయత అవసరాలకు అనుగుణంగా నడిపించగలిగిన నాడు, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడిచే అవకాశం ఉందన్నారు. గ్రామాలు స్వయంపోషకాలుగా అభివృద్ధి చెందడమే కాకుండా, యువత గ్రామీణాభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషించడంతో గ్రామస్వరాజ్యాలుగా అవతరించాలి.
మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పధకం ముఖ్య ఉద్ధేశం: భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం (India Government) ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
రాజీలేని అంశాలు
గ్రామ పంచాయితీలో నమోదు చేసుకొన్న ప్రతి కుటుంబానికి ఒక ఆర్ధిక సం.లో 100 ఒరజుల వేత ఉపాధి.
ఆర్.ఒ.ఎఫ్.ఆర్ లభిదారులకు 150 రోజుల వేతన ఉపాది.
పనిచేసిన 15 రోజుల్లో వేతనాలు చెల్లింపు.
స్త్రీ, పురుషులకు సమాన వేతనం.
గ్రామ సభ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులో ఆమోదించిన పనులను మాత్రమే చేపట్టాలి.
– సురేష్ కరోతు