వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఫ్రీక్వెంట్ గా సీరియస్ అవుతూనే ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై దాఖలైన తప్పుడు జీవోలను తరచూ సస్పెండ్ చేయడం జరుగుతోంది. లేటెస్టుగా పంచాయతీ సర్పుంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్‍వోలకు అప్పగిస్తూ జగన్ గవర్నమెంట్ జారీచేసిన జీవోను సైతం హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయినా జగన్మోహనరెడ్డి కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. అది అన్ని స్థాయిల్లోనూ జరుగుతోంది. కోర్టులు ఇస్తున్న ఆదేశాలను అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దాంతో అనేక మంది మళ్లీ కోర్టుల్లో కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేస్తున్నారు. ఇలా వేసిన కేసులు వివిధ కోర్టుల్లో దాదాపుగా ఎనిమిది వేల వరకూ ఉన్నాయట.
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఇటీవల తరచూ కోర్టు ధిక్కరణ కేసుల్లో హైకోర్టుకు హాజరవ్వాల్సి వస్తోంది. దీంతో ఆయన అసహనానికి గురవుతున్నట్లు వినికిడి. అధికారులతో స్పందన సమీక్షలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుడుతున్నాయి. కోర్టు ధిక్కరణ కేసుల్లో తక్షణం స్పందించి హైకోర్టుకు వివరణ ఇవ్వడం, కౌంటర్ దాఖలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అసలు కోర్టులను పట్టించుకోకపోవడం వల్ల పదే పదే హాజరవ్వాలని ఆదేశాలు వస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమీక్షలో పాల్గొన్న న్యాయశాఖ అధికారులు మొత్తం ఏపీ సర్కార్‌పై పెండింగ్‌లో ఉన్న ధిక్కరణ పిటిషన్ల గురించి చెప్పారట. ఎనిమిది వేల వరకూ ఉన్నాయని చెప్పడంతో నోరెళ్లబెట్టడం ఇతర అధికారుల వంతయింది. ఈ పరంపరం ముందు ముందు పెరుగుతుందో లేకపోతే కోర్టులను, న్యాయవ్యవస్థను గౌరవించడం మొదలుపెడతారో చూద్దాం.