Connect with us

Government

AP Special Representative గా NRI కోమటి జయరాం ని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు, California లో సెలబ్రేషన్స్

Published

on

అమెరికాలో తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు కోమటి జయరాం ని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా (Andhra Pradesh Special Representative) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిఎస్‌ శ్యామలరావు ఉత్తర్వులు వెలువరించారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

గతంలో కూడా కోమటి జయరాం ఈ పదవిని చేపట్టడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రంలో జన్మభూమి (AP Janmabhoomi) పధకం పేరుతో వివిధ కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టి అందరి మన్ననలు పొందారు. అందులో ప్రభుత్వ స్కూళ్ళకు డిజిటల్‌ సౌకర్యాల కల్పన వంటివి ఉన్నాయి.

అమెరికాలో తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్‌ (NRI TDP USA Coordinator) గా కూడా ఉన్న కోమటి జయరాం (Jayaram Komati) గత ఎన్నికల్లో కూటమి విజయానికి ఎన్నారైలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించారు. ఉత్తర అమెరికాలో టిడిపి బలోపేతానికి ఆయన కృషి చేశారు. జయరాం నియామకంపై పలువురు ఎన్నారైలు, టీడిపి (TDP) నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

దీంతో బే ఏరియా తెలుగుదేశం పార్టీ విభాగం (NRI TDP Bay Area, California) సభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు. నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అధికారిక ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం (Jayaram Komati) కి ప్రవాసులు అందరూ అభినందనలు తెలియజేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఈ బాధ్యతలో జయరాం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇండియాలో ఉన్న కోమటి జయరాం (Jayaram Komati) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) ని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే పూల మొక్క మరియు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected