ఐర్లాండ్ టీడీపీ (Ireland TDP) ఆధ్వర్యంలో నిన్న ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. టీడీపీ ఐర్లాండ్ వారుఎన్నికల ను ఉద్దేశించి తెలుగు దేశం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయిన శ్రీ చింతకాయల విజయ్ (Chintakayala Vijay) గారు మరియు తెలుగు దేశం మహిళా అధ్యక్షురాలు శ్రీ వంగలపూడి అనిత (Vangalapudi Anitha) గారు ఆన్లైన్ లో ప్రసంగించి వారి సందేశాన్ని ఈ విధంగా తెలియచేసారు.
యువ నాయకులు, తెలుగు దేశపు తురుపు ముక్క చింతకాయల విజయ్ గారు మాట్లాడుతూ.. తెలుగుదేశం బలం, ధైర్యం కార్యకర్తలు మాత్రమే, మేము ఎన్ని పోరాటాలు చేసిన మా మీద ఎన్ని వందల అక్రమ కేసులు బనాయించిన మాకు మీరు ఉన్నారు అనే ధైర్యం ఏ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గా వైస్సార్సీపీ ప్రభుత్వం చేసిన దమన కాండకు ప్రతి ఒక్కళ్ళు అన్యాయం అయిపోయారు అని తెలియచేసారు. ముఖ్యం గా యంగ్ ఓటర్లు జరగబోయే ఎన్నికలకు తెలుగుదేశం జనసేన కూటమికి వారి మొదటి ఓటు ను వేసి ఒక చిరస్మరణీయమయిన అనుభూతి ను పొందటానికి చాలా ఆత్రుతగా ఉన్నారు అని తెలియచేసారు. అంతే కాకుండా తెలుగు దేశం కూటమి విజయం దాదాపు గా ఖరారు అయిపోయింది అని అన్ని సర్వేలలో తెలియచేసారు అని అన్నారు. ఇంత చిన్న దేశం అయిన ఐర్లాండ్లో కూడా తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేస్తు యూరోప్ లోని వివిధ దేశాల తో సమాయత్తం చేసుకుంటున్న టీడీపీ యూరోప్ (NRI TDP Europe) కూటమి వారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.
మరో ముఖ్య నేత, ఫైర్ బ్రాండ్ శ్రీ వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ.. ఇంత మంది తెలుగు వారిని ఒకేచోట చూడటం చాలా ఆనందం గా ఉంది. తెలుగు మహిళా శక్తిని తెలియచేసే లాగా అత్యధిక సంఖ్య లో మహిళలు పాల్గొనటం చూసి సంబ్రమాత్సర్యాలకు లోనయ్యారు. ఇంత మంది మహిళలు పాల్గొనటం చూసి మరోసారి తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాత పార్టీ మరియు ముఖ్యంగా మహిళల పక్ష పాతి అని గుర్తు చేసారు. రాష్ట్రములో ప్రతి ఒక్కళ్లు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా టీడీపీ కూటమి ను ఎప్పుడు ఎప్పుడు గెలిపిద్దామా అనే దృఢ నిశ్చయం తో ఉన్నారు అని తెలియచేసారు.
ఈ సందర్భం గా టీడీపీ ఐర్లాండ్ మహిళా సభ్యురాలు దీప్తి గారు అడిగిన ప్రశ్నలకు అనిత గారు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను కుటుంబ భాద్యతలను సమన్వయము చేసుకుంటూ ముందుకు వెళ్ళతానికి నా ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు, వారు ఒక సెర్చ్ ఇంజిన్ లాంటి వారు మనకు తెలియని ఎన్నో విషయాల ను అయన ను చూసి, మాట్లాడి నేర్చుకోవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమం మధ్యలో శ్రీ పెద్ది రామారావు గారు వ్రాసిన డీకోడింగ్ ది లీడర్ (Decoding The Leader) అనే పుస్తకా విష్కరణ జరిగింది. ఆవిష్కరణ సందర్భం గా రామారావు గారు మాట్లాడుతూ.. చంద్రబాబు గారి మీద రాసిన ఈ పుస్తకం లోని కొంత ముఖ్య సమాచారాన్ని సభ్యులకుతెలియచేసారు.
తరువాత టీడీపీ యువ నేత మరియు టీడీపీ టార్చ్ బారియర్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ (Nara Lokesh) గారి జన్మదిన వేడుకలు ఘనం గా నిర్వర్తించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన టీడీపీ ఐర్లాండ్ సభ్యులు ప్రముఖ్ గోగినేని గారు మాట్లాడుతూ.. జగన్ (YS Jaganmohan Reddy) పని అయిపోయింది తరువాత మన సెలెబ్రేషన్స్ టీడీపీ గెలిచాక ఇంకో 3 నెలల లో ఇంకా ఘనంగా జరుగుతాయి అని తెలియచేసారు. మరో యువ నేత మరియు యువగళం లో లోకేష్ గారి అడుగు జాడల్లో నడచిన విజయ్ అడుసుమల్లి గారు మాట్లాడుతూ.. ఈ ఎలక్షన్స్ టీడీపీ కూటమి కి వచ్చే సీట్స్ మరియు మెజారిటీ కోసం మాత్రమే ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రజలు ఎపుడో డిసైడ్ అయిపోయారు అని తెలియచేసారు.
ఎలక్షన్స్ కార్యాచరణలో భాగంగా సభాధ్యక్షులు కిషోర్ బాబు (Kishore Babu) గారు మాట్లాడుతూ.. వార వన్ సైడ్ అయిపోయింది ప్రజలు అందరు టీడీపీ కి బ్రహ్మ రధం పట్టడానికి రెడీ గా ఉన్నారు. అయిన కానీ మనం రాబోయే 90 రోజులు ఇంకా బాగా పని చేసి మనకి అంటూ మనం కొన్ని అజెండాలు నియమించుకొని టీడీపీ ను అధికారం లోకి తీసుకురావటానికి మన వంతు మనం కృషి చేద్దాం అని, దాని లో భాగం సభ్యులు మాట్లాడుతూ వివిధ కమిటీలను నియమించటం జరిగింది. అందులో ముఖ్యంగా ఇక్కడ నుండి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే వారు, ఫోన్ ద్వారా ప్రజలకు పార్టీ సందేశం అందచేసేవారు, క్షేత్రస్థాయి లో ప్రచారం లో పాల్గొనే వారు ఇలా కొన్ని కమిటీలను నియమించటం జరిగింది. ముఖ్యంగా టీడీపీ ఐర్లాండ్ మరియు టీడీపీ యూరోప్ (NRI TDP Europe) సంయుక్తంగా ఒక 4 నుండి 8 నియోజక వర్గాలను ఎంపిక చేసుకొని వాటిలో గ్రామస్థాయి నుండి ప్రచారం లో పాల్గొనాలిఅని తీర్మానించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రోత్సహం మరియు సహకారం అందించిన NRI టీడీపీ అధినేత DR రవి కుమార్ గారికి సభ కృతజ్ఞతలు తెలిపింది.
ఈ ఎన్నికల శంఖారావం లో ఎన్నారై టీడీపీ ఐర్లాండ్ (NRI TDP Ireland) తరుపున ముఖ్య ఆఫీస్ బ్యారెర్స్, కార్యవర్గ సభ్యులు, అధికార ప్రతినిధులు కిశోరు బాబు చలసాని, కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ , రంగా గల్లా, శివ బాబు వేములపల్లి, ప్రముఖ్ గోగినేని , అచ్చుత కిషోర్ కొత్తపల్లి, మీరా కుమార్, కోటెంద్ర లెళ్ళ, విజయ్ కృష్ణ చందోలు, నరేంద్ర ముప్పవరపు, సాయి పవన్ రాజేష్ శర్మ, రవి రెడ్డి బాదం, నాగరాజు జడ, సీత రామ్ చల్లగుండ్ల, ప్రదీప్ కొమ్మినేని, రామకృష్ణ ఏలూరు, సుభాకర్ రామినేని, చంద్రశేఖర్, సుఖేష్ కొల్లూరి, నవీన్ మామిళ్లపల్లి, అనిల్ యార్లగడ్డ మరియు తెలుగుదేశం (Telugu Desam Party) ఆడపడుచులు దీప్తి అగ్తీల, సీత మహాలక్ష్మి, పృథ్విక, తులసి పరుచూరి మరియు నూటడెబ్బయ్ పైగా ప్రతినిదులు హాజరు అయ్యి వాళ్ళ అభిప్రాయాలు పాలుపంచుకున్నారు.టీడీపీ ఐర్లాండ్ అధ్యక్షులు భరత్ భాష్యం సభా ఏరాట్లు పర్యవేక్షించారు.