ఆటా 18వ కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ (ATA 18th Convention & Youth Conference) ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ పాజంట్ 2024 అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని పలు నగరాలలో టీన్, మిస్, మిస్సెస్, మిస్టర్ ఆటా బ్యూటీ పాజంట్ (Beauty Pageant) పోటీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా అట్లాంటా (Atlanta) సిటీ సెమీఫైనల్స్ ఏప్రిల్ 14 ఆదివారం రోజున కమ్మింగ్ నగరంలోని స్థానిక బంజారా బాంక్వెట్ హాల్ లో నిర్వహిస్తున్నారు. సాక్షి టీవీ (Sakshi TV) మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది. కన్వెన్షన్ కూడా అట్లాంటాలోనే కావడంతో ఈ బ్యూటీ పాజంట్ కార్యక్రమానికి బజ్ ఎక్కువైంది.
18వ ఆటా కన్వెన్షన్ జార్జియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (Georgia International Convention Center) వేదికగా ప్రముఖ జడ్జిల సమక్షంలో స్టార్ సెలెబ్రెటీస్ చేతుల మీదుగా ఫైనల్ విజేతలకు క్రౌన్ ప్రజంటేషన్ ఉంటుంది. మరిన్ని వివరాలకు www.NRI2NRI.com/ATA Beauty Pageant 2024 ని సందర్శించండి.