Connect with us

Beauty Contest

అమెరికా అంతటా టీన్, మిస్, మిస్సెస్, మిస్టర్ అందాల పోటీలు: ATA Pageant 2024

Published

on

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ అధ్యక్షులు మధు బొమ్మినేని (Madhu Bommineni), కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం (Kiran Pasham) నాయకత్వంలో జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటా (Atlanta) లో 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఈ కన్వెన్షన్ ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ పాజంట్ 2024 అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. 12 నగరాలలో టీన్, మిస్, మిస్సెస్, మిస్టర్ ఆటా బ్యూటీ పాజంట్ పోటీలు నిర్వహిస్తున్నారు. 18వ ఆటా కన్వెన్షన్ జార్జియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రముఖ జడ్జిల సమక్షంలో స్టార్ సెలెబ్రెటీస్ చేతుల మీదుగా ఫైనల్ విజేతలకు క్రౌన్ ప్రజంటేషన్ ఉంటుంది.

బ్యూటీ పాజంట్ పోటీలు (ATA Beauty Pageant) అమెరికాలోని అట్లాంటా, ర్యాలీ, షార్లెట్, డల్లాస్, ఆస్టిన్, న్యూ జెర్సీ, లాస్ ఏంజలెస్, చికాగో, ఓర్లాండో, వాషింగ్టన్ డీసీ, నాష్విల్, డెట్రాయిట్ నగరాల్లో నిర్వహిస్తారు. రెజిస్ట్రేషన్, ఫీజు, నిబంధనలు తదితర వివరాలకు www.NRI2NRI.com/ATA Beauty Pageant 2024 ని సందర్శించండి.

ఆటా బ్యూటీ పాజంట్ 2024 అందాల పోటీలకు శ్రావణి రాచకుల్ల ఛైర్ గా, నీహారిక నవల్గా అడ్వైజర్ గా, గాయత్రి ఆయల & అనూజ గొల్ల కోఛైర్స్ గా, శ్వేత పెతే, దీప్తి ఎల్గూరి, విద్య క్రాప, అర్చన కపూర్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ వివరాలకు www.ataconference.org ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected