Connect with us

Associations

ఆటా చరిత్రలో రెండవ మహిళా అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని, లాస్ వేగాస్ లో బోర్డ్ మీటింగ్

Published

on

. లాస్ వేగాస్ లో ముగిసిన ఆటా బోర్డ్ మీటింగ్
. భువనేశ్ బూజల చేతుల మీదుగా మధు బొమ్మినేని బాధ్యతల స్వీకరణ
. జాతీయ తెలుగు సంఘాల్లో అధ్యక్ష పదవి రెండవసారి మహిళకి దక్కడం ఇదే ప్రధమం
. తదుపరి ఆటా అధ్యక్షులుగా జయంత్ చల్లా ఏకగ్రీవ ఎన్నిక
. 2023-24 ఆటా బోర్డు & ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

అమెరికా తెలుగు సంఘం (American Telugu Association) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు డా. సంధ్య గవ్వ కాగా ఇప్పుడు మధు బొమ్మినేని రెండవ మహిళా అధ్యక్షురాలిగా ఆటా రికార్డుల కెక్కారు. జాతీయ తెలుగు సంఘాల్లో అధ్యక్ష పదవి రెండవసారి మహిళకి దక్కడం ఇదే ప్రధమం.

గత వారాంతం శనివారం లాస్ వేగాస్ (Las Vegas) లోని ది మిరేజ్ హోటల్ లో జరిగిన ఆటా బోర్డు మీటింగ్ లో ప్రస్తుత అధ్యక్షులు భువనేశ్ బూజల (Bhuvanesh Boojala) చేతుల మీదుగా మధు బొమ్మినేని (Madhu Bommineni) నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సమావేశానికి యూఎస్ లోని అన్ని ప్రాంతాల నుండి ఆటా (ATA) డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. నార్త్ కరోలినా (North Carolina) ప్రాంతానికి చెందిన మధు బొమ్మినేని 2004 నుండి ‘ఆటా’ లో చురుగ్గా ఉండటంతో పాటు, ఆటా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి అనేక పదవుల్లో సేవలందించారు.

2023 జనవరిలో ఆటా లోని 16 బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (Board of Trustee) స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన సభ్యులు నాలుగేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. అనిల్ బొద్దిరెడ్డి, సన్నీరెడ్డి, కిరణ్ పాశం, కిషోర్ గూడూరు, మహీదర్ ముస్కుల, నర్సిరెడ్డి గడ్డికొప్పుల, రామకృష్ణా రెడ్డి అల, రాజు కక్కెర్ల, సాయి సుధిని, శ్రీకాంత్ గుడిపాటి, నర్సింహారెడ్డి ధ్యాసాని, రఘువీర్ మరిపెద్ది, సాయినాథ్ బోయపల్లి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ దర్గుల, వినోద్ కోడూరు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

ఆటా బోర్డు (ATA Board) ఏకగ్రీవంగా జయంత్ చల్లా (Jayanth Challa) ను కాబోయే ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది. ఆటా బోర్డు 2023 మరియు 2024 టర్మ్ కి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి అల (కార్యదర్శి), సతీష్ రెడ్డి (కోశాధికారి), తిరుపతిరెడ్డి యర్రంరెడ్డి (జాయింట్ సెక్రటరీ), రవీందర్ గూడూరు (జాయింట్ ట్రెజరర్) మరియు హరి ప్రసాద్ రెడ్డి లింగాల (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) గా ఎన్నికయ్యారు.

నూతన అధ్యక్షురాలు మధు బొమ్మినేని (Madhu Bommineni) మాట్లాడుతూ, భవిష్యత్ లక్ష్యాలు మరియు ఆటా రోడ్ మ్యాప్ వివరాలను పంచుకున్నారు. ఆటా సభ్యులంతా నిబద్ధత, ఐక్యత, బాధ్యత తో సమాజ సేవలో ముందుండాలని తెలిపారు. అక్షరాస్యత, సాంస్కృతిక, విద్యా, సామాజిక కార్యక్రమాలను ప్రోత్సాహంచాలనే ప్రాథమిక లక్ష్యాలకు ఆటా (ATA) కట్టుబడి ఉంటుందన్నారు.

యువతరాన్ని భాగస్వామ్యం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మధు బొమ్మినేని తెలిపారు. మహిళా నాయకత్వాన్ని (Women Leadership) ప్రోత్సహించడం, ఆటా కార్యకలాపాలు మరింత విస్తరించడంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామని మధు బొమ్మినేని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా ‘ఆటా’కు సేవలందించిన అధ్యక్షులు భువనేశ్ భూజాల మరియు సభ్యులను మధు బొమ్మినేని అభినందించారు.

సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యాన్ని పెంచడం, ATA SEVA కు అవసరమైన వనరులతో మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి వీలు కల్పించడం, విద్యార్థి సేవలతో పాటు, సమాచార మరియు ఆరోగ్య సేవల కార్యక్రమాలకు తన పదవీ కాలంలో మరింత ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected