Connect with us

Convention

ఆప్త బంధువులతో ఆప్త 15 వసంతాల పండుగ @ Atlanta: APTA National Convention

Published

on

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (American Progressive Telugu Association – APTA) ‘ఆప్త’ 15వ వార్షికోత్సవం సందర్భంగా 15 వసంతాల పండుగ అంటూ APTA National Convention 2023 ని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా మహానగరంలో ఈ వారాంతం ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఆప్త బంధువులతో అట్లాంటా లోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఆప్త జాతీయ సమావేశానికి అమెరికా నలుమూలల నుంచి ఆప్త సభ్యులు రానున్నారు. అలాగే ఇండియా నుంచి పలువురు రాజకీయ, సాహితీ, సినీ లెజెండ్స్ హాజరవనున్నారు.

తెలుగు వైభవాన్ని చాటిచెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీనివాస కళ్యాణం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) పుట్టినరోజు వేడుకలు, ఆధ్యాత్మిక, వినోదాత్మక, సాహిత్య కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, యంగ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ వంటి వివిధ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.

ఆప్త అమెరికన్ ఐడల్ (APTA American Idol), ఆప్త ఒలింపిక్స్, మూడు రోజులపాటు మూడు మ్యూజికల్ కాన్సర్ట్స్ (మణిశర్మ, కోటి, రఘు కుంచె) ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరిన్ని వివరాలకు www.NRI2NRI.com/APTA National Convention 2023 in Atlanta ని సందర్శించండి.

గత ఫిబ్రవరి లో కన్వెన్షన్ అనౌన్స్మెంట్, ఏప్రిల్ లో కిక్-ఆఫ్ సమావేశంలో ఆప్త పదిహైను ఏళ్ళ సంబరాల లొగోని ఆవిష్కరించడం దగ్గిర నుండి విరాళాలు సేకరించడం, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, హొటెల్స్, భోజన తదితర ఏర్పాట్లతో ఇప్పటి వరకు ఆప్త కన్వెన్షన్ కమిటీ, ఆప్త (APTA) కార్యవర్గ సభ్యులు మరియు పలు కమిటీల ఛైర్స్, కోచైర్స్ నిమగ్నమై ఉన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected