రౌద్రం రణం రుధిరం (ఆర్ ఆర్ ఆర్) “నాటు నాటు” పాటకు గాను ఉత్తమ ఒరిజనల్ పాట కేటగిరిలో సినీ అత్యున్నత పురస్కారం ఆస్కార్ అందుకొన్న సందర్భంగా చంద్రబోస్ గారికి, కిరవాణి గారికి మరియు చిత్ర యూనిట్ కి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు ఉదయ్ భాస్కర్ కొట్టె హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
తెలుగు ప్రజలే కాకుండా యావత్ భారతదేశం ఎదురు చూసిన కల నేరవేరింది. యావత్ దేశం సంతోషంతో పులకరించి పోయింది. మనందరి ఆశలను మోసుకుంటూ లాస్ ఏంజిల్స్‌లో అడుగు పెట్టిన ఆర్.ఆర్.ఆర్ (RRR) ఆస్కార్ విజేతగా నిలిచింది. నాటు నాటు పాటను ఆస్కార్ అవార్డ్ వరించింది.
ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఈ అవార్డు రావటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఎనిమిది దశాబ్దాలు దాటిన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రానీ ప్రపంచ స్థాయి గుర్తింపు ఇది.
అప్త అధ్యక్షులు ఉదయ్ భాస్కర్ కొట్టె గారు శుకృవారం సాయింత్రమే లాస్ ఏంజిల్స్ చేరుకొని అక్కడ గ్లోబల్ స్టార్ రాం చరణ్ కి స్వయంగా కలుసుకొని అప్త తరుపున గీత రచయిత చంద్రబోస్ గారికి, స్వరపరిచిన కీరవాణి గారికి, ఆలపించిన రాహుల్ సిప్లిగంజి గారికి, కాలబైరవ గారికి, నృత్యంతో అలరించిన రాం చరణ్ మరియు జూనియర్ ఎంటీఆర్ గారికి మరియూ ధర్శకులు రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
వారి మాటల్లో “సినీప్రస్తానంలో బోస్ గారిదో శకం, సాహితీవేత్తలకు అయనో సరస్వతీ పుత్రుడు. జనపదాలకు అయనో జానపద కళాకారుడు. నాదేశంలో నందులు, గ్లోబ్లో గొల్డెన్ గ్లోబ్ అవార్డులు, విమర్శకులతో ప్రశంసలు, గీత రచయితగా ప్రపంచ ప్రముఖుల సరసన జోడి, అస్కార్ అవార్డులు. ఏడువందల సినిమాలు, రెండువేల ఐదువందల పాటలు, ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం” అంటూ వేనోళ్ళ పొగిడారు.