అమెరికాలో 1943 లోనే నిర్మించిన మినీ డ్యాంల నిర్మాణం అద్భుతం అని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పేర్కొన్నారు. అమెరికా లోని టెక్సాస్-ఒక్లహోమా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న డేనీసన్ డ్యాంను సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ.. 1943లో ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా అమెరికా దేశంలో విద్యుత్ కొరత తీర్చడానికి తక్కువ ఖర్చుతో కాంక్రీట్ స్ట్రక్చర్ లేకుండా రెడ్ రివర్ మీద టెక్సాస్ ఒక్లహోమా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో కేవలం ఎర్త్ కం రాక్ ఫీల్డ్ డ్యాం (ఈ సి ఆర్ ఎఫ్) ను నిర్మించి దాని ఎగువ భాగంలో ఉన్న రిజర్వాయర్ లో ఇంటెక్ స్ట్రక్చర్ నిర్మించి ఎత్తును పెంచి టర్బైన్ ద్వారా 8.49 మిలియన్ మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
అలాగే రెడ్ రివర్ మీద 165 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించి దీని క్రింద 1,46,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని, మన ఆంధ్రప్రదేశ్ ని ఉపనదుల ద్వారా వృధా అవుతున్న నీటిని సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చుతో ఇలాంటి మినీ డ్యాంలు నిర్మించి రైతులకు సాగునీరు, రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ అర్ ఐ లు తుమ్మల రాంబాబు, కాకర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.