తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ మొదటిసారిగా జాతీయ స్థాయిలో క్రికెట్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్న విషయం తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ గతంలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా గత వారాంతం షార్లెట్ లో అపలాచియన్ రీజియన్ లెవెల్ టోర్నమెంట్ తానా ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.
దీంతో క్రికెట్ అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ తానా క్రికెట్ ఛాంపియన్షిప్ కి జాతీయ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించడానికి ఏజి ఫిన్ టాక్స్ అధినేత అనిల్ గ్రంధి ముందుకు వచ్చారు. దీంతో ఈ జాతీయ టోర్నమెంట్ ని మున్ముందు ‘తానా – ఏజి ఫిన్ టాక్స్ క్రికెట్ కప్ 2022’ గా నామకరణం చేసినట్లు తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ తెలిపారు.
తదుపరి అమెరికా అంతటా వివిధ రీజియన్ల స్థాయిలో, చివరిగా జాతీయ స్థాయిలో నాకౌట్ ఫార్మాట్లో ‘తానా – ఏజి ఫిన్ టాక్స్ క్రికెట్ కప్ 2022’ పేరుతో ఈ జాతీయ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. జాతీయ స్థాయి ఫైనల్స్ విజేతలకు మరియు రన్నర్స్ జట్లకు ఏజి ఫిన్ టాక్స్ ప్రైజ్ మనీ అందజేస్తారు.