Connect with us

Community Service

Adopt A Highway కార్యక్రమంలో భాగంగా రోడ్లు శుభ్రం చేసిన NATS Chicago Chapter విద్యార్ధులు

Published

on

Chicago, Illinois: భావితరంలో సామాజిక బాధ్యత పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (North America Telugu Society – NATS) అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చికాగో (Chicago) లో హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టి హైవేను శుభ్రం చేసింది.

చికాగో నాట్స్ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో20 మందికి పైగా తెలుగు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహాంగా పాల్గొన హైవే (Highway) ను శుభ్రం చేశారు. ఇలా తెలుగు విద్యార్ధులు నాట్స్ (NATS) ద్వారా చేసిన ఈ సామాజిక సేవకు అమెరికా ప్రభుత్వం నుంచి వాలంటీర్ అవర్స్ (Volunteer Hours) కూడా లభిస్తాయి.

ఇవి విద్యార్ధుల కాలేజీ ప్రవేశాలకు ఉపకరిస్తాయి. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) ఈ నాట్స్ (North America Telugu Society – NATS) హైవే దత్తత (Adopt A Highway) కార్యక్రమంలో పాల్గొని విద్యార్ధులను ప్రోత్సాహించారు.

నాట్స్ చికాగో చాప్టర్ (NATS Chicago Chapter) కోఆర్డినేటర్లు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, వీర తక్కెళ్ళపాటి తమ పక్కా ప్రణాళిక, సమర్థవంతమైన సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు, చికాగో చాప్టర్  నుంచి  పాండు చెంగలశెట్టి,ఈశ్వర్ వడ్లమనాటి, శ్రీనివాస్ ఎక్కుర్తి, దివాకర్ ప్రతాపుల, గోపాల్‌ లకు నాట్స్ (NATS) ధన్యవాదాలు తెలిపింది.

ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు శ్రీనివాస్ పిడికిటి (Srinivas Pidikiti), ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్‌కే బాలినేని (RK Balineni), హరీష్ జమ్ముల (Harish Jammu), ఎమ్మాన్యుయేల్ నీలా, అలాగే మాజీ బోర్డ్ సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరిసాడ, శ్రీనివాస్ బొప్పన లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచే చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన చికాగో నాట్స్ (NATS Chicago Chapter) నాయకులను నాట్స్ (North America Telugu Society – NATS) చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected