ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) అమెరికాలోని పలు రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన చాఫ్టర్స్ అన్నింటిలోకెల్లా అరిజోనా చాప్టర్ (AAA Arizona Chapter) పెద్దది మరియు ముఖ్యమైనది. ఒక సంస్థ సత్తువ తెలియాలంటే ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ చెయ్యాలి.
AAA అరిజోనా చాప్టర్ మాత్రం ఈవెంట్ కి ముందే తన బలాన్ని చాటుతుంది. ఇక వివరాలలోకి వెళితే… AAA అరిజోనా చాప్టర్ సంక్రాంతి సంబరాలు ఫిబ్రవరి 1న ఫీనిక్స్ (Phoenix, Arizona) నగరంలోని డ్రీమ్ సిటీ కమ్యూనిటీ సెంటర్ (Dream City Community Center) లో నిర్వహించడానికి ప్రణాళిక వేశారు.
ఇన్ని సంవత్సరాలలో డ్రీమ్ సిటీ కమ్యూనిటీ సెంటర్ (Dream City Community Center) లో నిర్వహించే మొట్టమొదటి ఇండియన్ ఈవెంట్ AAA అరిజోనా చాప్టర్ సంక్రాంతి సంబరాలు కావడం ప్రత్యేకత. ఇంతకు ముందు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపైన్ కూడా ఇదే వేదికపై జరగడం చూస్తే వెన్యూ ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు.
ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారు కాకుండా ఆరుగురు గాయనీగాయకులతో కలిసి స్వర బ్రహ్మ మణిశర్మ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ మరో ప్రత్యేకత.అంతేకాకుండా ఈ హై వోల్టేజ్ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) వ్యవస్థాపకులు హరి మోటుపల్లి (Hari Motupalli) తోపాటు జాతీయ నాయకులు సైతం రానుండడంతో ఈవెంట్ స్కేల్ పెరిగింది.
45 కి పైగా ఆంధ్ర ప్రత్యేక వంటకాలతో ఉచిత పండుగ భోజనం మరో ప్రత్యేకం. ఇలా చెప్పుకుంటూ పొతే అన్నీ ప్రత్యేకతలే. AAA అరిజోనా చాప్టర్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గొట్టిపాటి (Kalyan Gottipati) సారధ్యంలో టీం అందరి సహకారంతో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, నృత్యాలు, సింగింగ్ ఎటూ ఉండనే ఉన్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాలలో (Cultural Programs) పాల్గొనేవారే 400 మంది ఉన్నారంటే ఇక అర్ధం చేసుకోండి. వెన్యూ సీటింగ్ 4000 ఐతే ఇప్పటికే వేలల్లో RSVP లు రావడంతో రిజిస్ట్రేషన్ ఆపేశారు. సాంస్కృతిక కార్యక్రమాలకు గత వారాంతం డ్రై రన్ సైతం చేయడం చూస్తుంటే ఇది ఒక మినీ కన్వెన్షన్ (Mini Convention) ని తలపించనుంది.
వెస్ట్ కోస్ట్ లో అతి పెద్ద ఈవెంట్స్ జాబితాలో చేరనుంది ఈ ఈవెంట్. మిగతా AAA చాఫ్టర్ల కంటే చాలా మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 1 శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి ఫీనిక్స్ నగరంలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలే కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) వారి అతిధ్యాన్ని స్వీకరించండి.