ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి నేషనల్ కన్వెన్షన్ (Convention) నిన్న మార్చి 28వ తేదీన పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రం, ఫిలడెల్ఫియా నగరం లోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ (The Greater Philadelphia Expo Center, Oaks) లో మోత మోగించింది.
దీంతో Andhra Pradesh American Association (AAA) మొట్టమొదటి కన్వెన్షన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అతిథులు, సెలెబ్రిటీలు (Celebrities), AAA నాయకులు మరియు స్టార్స్ (Stars) వేదిక ప్రాంగణానికి చేరుకున్నారు.
ముందుగా పూజారుల మంత్రాల నడుమ AAA మహిళా నాయకులు విఘ్నేశ్వరుని చెంత జ్యోతి ప్రజ్వలనతో బాంక్వెట్ డిన్నర్ మొదటి రోజ్ రోజు కార్యక్రమాన్ని శుభకరంగా ప్రారంభించారు. కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు (Satya Vijju) మరియు రవి చిక్కాల (Ravi Chikkala) స్వాగతోపన్యాసం గావించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) అందరినీ అలరించాయి. టాలీవుడ్ హీరోయిన్ రుహాని శర్మ (Ruhani Sharma) మరియు సినీ దర్శకులు వెంకీ అట్లూరి (Venky Atluri) మ్యూజిక్ అవార్డ్స్ (Music Competition) విజేతలను ప్రకటించారు. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు.
సినీ నటులు తరుణ్ (Tarun Kumar) నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. ఆముదాలవలస, మార్కాపురం టీడీపీ (TDP) శాసనసభ్యులు కూన రవికుమార్ (Koona Ravi Kumar), కందుల నారాయణ రెడ్డి మరియు వైజాగ్ సౌత్ జనసేన (Janasena) శాసనసభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ లను వేదికపైకి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.
దాతలను, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినంచించారు.ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఫౌండర్ హరి మోటుపల్లి (Hari Motupalli) AAA సంస్థ ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA సంస్థ ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా AAA సంస్థ అధ్యక్షులు బాలాజీ వీర్నాల (Balaji Veernala) సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. బీ ఏ రోమన్ ఇన్ రోమ్ అన్నట్లు అమెరికా స్టైల్ లో కన్వెన్షన్ కి టోస్ట్ రైజ్ (Raise a Toast) చేశారు. లేడీస్ అండ్ యూత్ టాలీవుడ్ హీరోస్, హీరోయిన్స్, రాజకీయ నాయకులతో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా కనిపించారు.
చివరిగా నిరవల్ బ్యాండ్ సంగీత విభావరి (Musical Night) అందరినీ అలరించింది. స్లో సాంగ్స్ తో మొదలు పెట్టి, చిన్నగా స్పీడు పెంచి, ఫాస్ట్ ట్రాక్ పాటలతో ఊపు తెచ్చారు. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ (Niraval Band) సింగర్స్ పాటలకు చిందులేస్తూ ఆనందించారు.
విజయవంతమైన డే వన్ ప్రోగ్రాంలో సినీనటులు సందీప్ కిషన్ (Sundeep Kishan), ఆది, సుశాంత్ (Sushanth Anumolu), తరుణ్, విరాజ్ (Viraj Ashwin), హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత (Ankita) పాల్గొన్నారు. వీరందరినీ వేదికపైకి ఆహ్వానించి AAA ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే తెలుగు సినీ దర్శకులు శ్రీను వైట్ల (Srinu Vaitla), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), వెంకీ అట్లూరి, వీరభద్రం చౌదరి (Veerabhadram Chowdary) తదితరులు కూడా పాల్గొన్నారు. చక్కని హాస్పిటాలిటీతో ఆంధ్ర స్టైల్ భోజనాలు, స్నాక్స్, డ్రింక్స్ భుక్తాయాసం కలిగేంత బాగున్నాయి. దీంతో కన్వెన్షన్ మొదటి రోజైన బాంక్వెట్ డిన్నర్ మోత మోగించినట్లయింది.