Connect with us

Conference

AAA రెండు రోజుల కన్వెన్షన్ పండుగకు Thaman Concert తో అదిరే ముగింపు, AP సంస్కృతిని ప్రతిబింభించిన వైనం

Published

on

అమెరికాలో ఆంధ్రుల చేత, ఆంధ్రుల కొరకు, ఆంధ్రులే స్థాపించిన మొట్టమొదటి మరియు ఏకైక జాతీయ స్థాయి తెలుగు సంఘం ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) నిర్వహించిన మొట్టమొదటి కన్వెన్షన్ నిన్న మార్చి 29న ఘనంగా ముగిసింది.

మొదటి రోజైన బాంక్వెట్ డిన్నర్ మోత మోగేలా విజయవంతం కాగా, నిన్న కన్వెన్షన్ రెండో రోజులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింభించాయి. ఉదయం శాస్త్రోక్తంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం (Sri Srinivasa Kalyanam) నిర్వహించారు.

ఉగాది (Ugadi) పండుగను పురస్కరించుకొని పండితులు పంచాంగ శ్రవణం గావించారు. అలాగే భక్తులకు పూజా ప్రసాదం అందించారు. అనంతరం లంచ్ కోసం కొంచెం బ్రేక్ ఇచ్చి, కన్వెన్షన్ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) ప్రారంభించారు.

సాయంత్రం ముఖ్య అతిథులు రాగానే క్లాసికల్ నృత్యాలతో ఆంధ్ర (Andhra Pradesh) సంస్కృతికి అద్దం పట్టారు. మధ్య మధ్యలో స్పాన్సర్స్ ప్రమోషన్ వీడియోలు ప్రదర్శించారు. మహిళలు చక్కని ఇండియన్ ట్రెడిషనల్ వస్త్రధారణలో ప్రదర్శించిన ఫ్యాషన్ షో (Fashion Show) అందరినీ ఆకట్టుకుంది.

కొన్ని సినిమా పాటల నృత్యాల అనంతరం మార్కాపురం, ఆముదాలవలస ఎమ్మెల్యేలు (MLA) కందుల నారాయణ రెడ్డి మరియు కూన రవికుమార్ లు ప్రసంగించారు. తెలుగు సినీ ప్రపంచానికి చెందిన నటీనటులు వేదికపై ముగ్గుల పోటీలు, షార్ట్ ఫిల్మ్స్ (Short Films) పోటీల విజేతలను ప్రకటించారు.

ఈ సందర్భంగా టాలీవుడ్ (Tollywood) హీరోస్ సుశాంత్ (Sushanth) మరియు విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రవాసులను ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను సగౌరవంగా సన్మానించారు. అలాగే కన్వెన్షన్ కమిటీల లీడర్షిప్ (Convention Committees Leadership) ని సభికులకు పరిచయం చేసి వారి సేవలను కొనియాడారు.

ఇక చివరిగా గ్రాండ్ ఫినాలేలో భాగంగా వరుస సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి మంచి ఫార్మ్ లో ఉన్న టాలీవుడ్ ఫేమస్ సంగీత దర్శకులు తమన్ (Ghantasala Sai Srinivas Sivakumar) లైవ్ మ్యూజికల్ నైట్ (Concert) కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉండగా గ్రాండ్ ఎంట్రీ తో వేదిక పైకి విచ్చేశారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా పాటతో మొదలు పెట్టి, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లు నటించిన మూవీస్ లోని పాటలతో హోరెత్తించారు. మధ్య మధ్యలో జై బాలయ్య (Jai Balayya) అంటూ నందమూరి బాలక్రిష్ణ ఫాన్స్ స్లొగన్స్ చేయగా, చివరికి బాలయ్య నటించిన వరుస బ్లాక్క్బస్టర్ సినిమాలలోని పాటలు పాడి Concert ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.

మరోపక్క మధ్యాహ్నం నిర్వహించిన రియల్ ఎస్టేట్, ఫైనాన్సియల్ ప్లానింగ్, వ్యాపార మరియు ఉద్యోగ సంబంధిత సదస్సులలో (Business Networking Seminars) పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ కున్న సందేహాలను నిపుణులను అడిగి నివృత్తి చేసుకున్నారు.

బాంక్వెట్ డే లానే రెండో రోజు కూడా భోజనాలు రుచికరంగా మరియు ఎక్కడా లోటు పాట్లు లేకుండా అందించారు. ఈ విషయంలో కన్వెన్షన్ కమిటీ సభ్యులను, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించాలి. కన్వెన్షన్ సెంటర్ కి, హోటల్ కి రాను పోను ట్రావెల్ అరేంజిమెంట్స్ చక్కగా చేసారు.

పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రం, ఫిలడెల్ఫియా (Philadelphia) నగరం లోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ (The Greater Philadelphia Expo Center, Oaks) లో రెండు రోజులపాటు ఒక పండుగలా నిర్వహించిన AAA (Andhra Pradesh American Association) కన్వెన్షన్ కి వందన సమర్పణతో అదిరే ముగింపు పలికారు.

error: NRI2NRI.COM copyright content is protected