అట్లాంటాలోని ఫోర్ సైత్ కౌంటీ అంటే తెలియని వారు ఉండరు ప్రత్యేకంగా భారతీయులలో. ఎందుకంటే భారతీయులతో పాటు మమేకమైన విభిన్న ప్రజలతో భిన్నత్వంలో ఏకత్వంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కౌంటీ కనుక. అమెరికాలో ఉంటూ ఇప్పటికీ భారతదేశ రాజకీయాలను, ప్రభుత్వాలను అతి దగ్గిరగా గమనించే మనం మన ఫోర్ సైత్ కౌంటీలో, మన జార్జియా రాష్ట్రంలో పాలకులు ఎవరు, అధికారులు ఎవరు, వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆ నిర్ణయాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి తదితర విషయాలను తెలుసుకోవాలని ఉందా? మీ అభిప్రాయాలను, ఆలోచనలను, సలహాలను తెలుపుదామనుకుంటున్నారా? అలాగే ఈ మధ్య భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎక్కువవుతున్న దొంగతనాలను గురించి అధికారులతో మీ ఆందోళనను తెలియజేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, అట్లాంటాలోని అన్ని భారతీయ సంఘాలు కలిసి ఈ ఆదివారం మే 6 న 3:30 నుండి 7:00 వరకు కమ్మింగ్ లోని బ్రూక్వుడ్ ఎలిమెంటరీ స్కూల్లో నిర్వహిస్తున్న ‘మీట్ యువర్ లా మేకర్స్’ కార్యక్రమానికి వెళదాం పదండి. ఈ చక్కని ముఖా ముఖి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఎందుకంటే బీ ఏ రోమన్ ఇన్ రోమ్ అని అన్నారు కదా పెద్దలు.