మైకు దొరికితే చాలు భారతీయ జనతా పార్టీ నేతలు హిందుత్వం, హిందూ దేవుళ్ళు అంటూ విభజన రాజకీయాలు చేస్తుంటారు. అయోధ్యలో రామాలయం ఉండేది మళ్ళీ నిర్మిస్తాం అని మాటలు చెప్పే ఈ భాజపా నేతల నోరుకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ రోజు సాక్షాత్తు గుజరాత్ అసెంబ్లీ స్పీకర్, కమలం పార్టీ నేత రాజేంద్ర త్రివేది ఇంకో అడుగు ముందుకేసి రాముడు క్షత్రియుడు, కృష్ణుడు ఓబీసీ అంటూ దేవుళ్ళని కూడా వదలలేదు. అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రధానమంత్రి మోడీ బ్రాహ్మణులు అంటూ కొత్త నిర్వచనం చెప్పారు. ఈ భారతీయ జనతా పార్టీ బుద్ధిహీనులకు కొంచెం మంచి బుద్ది ప్రసాదించమని ఆ శ్రీరాముడు, కృష్ణుడులను వేడుకోవడం తప్ప మనమేమి చేయగలం!