Connect with us

Convention

నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాల తొలి సన్నాహాక సమావేశం ఫలవంతం

Published

on

ఆగస్ట్ 9, న్యూ జెర్సీ: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిపే అమెరికా తెలుగు సంబరాలను ఈ సారి న్యూజెర్సీ వేదికగా ఘనంగా జరిపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే 7వ అమెరికా తెలుగు సంబరాల కోసం తొలి సన్నాహక సమావేశాన్ని న్యూజెర్సీలో నిర్వహించింది. ఈ సారి సంబరాలు ఎలా ఉండాలి? తెలుగువారు అధికంగా ఉండే న్యూజెర్సీలో ఎంత మంది ఈ సంబరాలకు వస్తారు? సంబరాలకు ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించారు.

నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసానితో పాటు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు సెక్రటరీ శ్యామ్ నాళం, నాట్స్ బోర్డు డైరెక్టర్‌లు రాజ్ అల్లాడ, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల, నేషనల్ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ గురు దేసు, న్యూజెర్సీ టీమ్ సభ్యులు వంశీ కొప్పురావూరి, అరుణ్ శ్రీరామ్, బసవ శేఖర్, పున్నా సూర్యదేవర, శరత్ వేట తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నాట్స్ మాజీ ఛైర్మన్ శ్యాం మద్దాలి, నాట్స్ మాజీ ప్రెసిడెంట్ గంగాధర్ దేసు, మాజీ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర అప్పలనేని లు ఈ సమావేశంలో సంబరాల్లో తమ అనుభవాలను వివరించారు. టీఎఫ్ఎఎస్ ప్రెసిడెంట్ మధు రాచకుళ్ల తో పాటు, టీఎఫ్ఎఎస్ ఎగ్జిక్యూటివ్ టీమ్, టీఏజీడీవీ ప్రెసిడెంట్ రెహమాన్ తో పాటు ఆయన ఎగ్జిక్యూటివ్ టీమ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. రమేష్ మాగంటి, భాస్కర్ భూపతి, సుధాకర్ ఉప్పల, ప్రసాద్ కునిశెట్టి, కవిత తోటకూర తో పాటు అనేక మంది తెలుగు సంఘాల నాయకులు ఈ కీలక సమావేశంలో తమ అనుభవాలను వివరించడంతో పాటు విలువైన సలహాలు, సూచనలు అందించారు.

స్థానిక కళాకారులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నాట్స్ నినాదమైన భాషే రమ్యం సేవే గమ్యం కు తగ్గట్టుగా ఈ 7 వ సంబరాలను ప్రత్యేకంగా రూపు దిద్దటానికి నడుము బిగించి తనతో కలిసి అందరూ ఒకే త్రాటిపై నడిచి అంబరాన్ని అంటేలా చేసి చూపిద్దామని శ్రీధర్ అప్పసాని పిలుపునిచ్చారు. అలాగే నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి ఈ సమావేశంలో పాల్గొన్నవారందరినీ అభినందిస్తూ నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాలు ఘన విజయం సాధించేలా అందరం కృషి చేద్దామన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected