తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం మరియు ఉత్తర అమెరికా తెలుగు సంఘం న్యూయార్క్ విభాగం సంయుక్తంగా మదర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. మే 1 ఆదివారం నిర్వహించనున్న ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ కి న్యూయార్క్ లోని స్థానిక కాటిలియన్ రెస్టారెంట్ వారి ఈవెంట్ హాల్ వేదిక.
మహిళలకు మాత్రమే ప్రవేశమున్న ఈ మదర్స్ డే కార్యక్రమంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రముఖ గాయని మరియు వ్యాఖ్యాత దీప్తి తన పాటలు, వ్యాఖ్యానంతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా వివిధ ప్రోగ్రామ్స్ అందరినీ అలరించనున్నాయి.
ఆకర్షణీయమైన షాపింగ్ స్టాల్ల్స్, ప్రేత్యేక ఫోటోబూత్, వంట పోటీలు, ఫ్యాషన్ షో, నృత్య ప్రదర్శనలు, ర్యాఫుల్ బహుమతులు, ఆట పాటలు వంటి సరదా కార్యక్రమాలు బోలెడన్ని ఉన్నాయి. ఈ సెలబ్రేషన్స్ కి ప్రవేశ రుసుము 15 డాలర్లు మాత్రమే. క్రింది ఫ్లయర్లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఫ్లయర్లో ఉన్న ఫోన్ నంబర్స్ కి కాల్ చెయ్యండి.
మదర్స్ డే ప్రత్యేకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం నుంచి మాధవి కోరుకొండ, సుధా రాణి మన్నవ మరియు అరుంధతి అడుప, అలాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం న్యూయార్క్ విభాగం నుంచి శిరీష తూనుగుంట్ల, దీపిక సమ్మెట, యమున మన్నవ, సుచరిత అనంతనేని మరియు శైలజ చల్లపల్లి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.