Hyderabad, India: ఆత్మీయ యూఎస్ఏ (Atmiya USA) బోర్డు చైర్ డాక్టర్ మంజుల రగుతు MD గారు కమ్యూనిటీ పెద్దలు మరియు లీడర్లతో ఆత్మీయ సమావేశం (Meet & Greet) అత్యంత ఆహ్లాదకరంగా హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో ఎం ఏసుబాబు గారి అధ్యక్షతన ఈరోజు ఉదయం 9 గంటలకు బ్రేక్ ఫాస్ట్ తో ప్రారంభమైనది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పెద్దలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు పూర్వ న్యాయమూర్తి శ్రీ భవాని ప్రసాద్ గారు మరియు పూర్వ కృష్ణా జిల్లా (Krishna District) కలెక్టర్ మరియు మాజీ టీ టీ డి జేఈవో శ్రీ లక్ష్మీకాంతం గారు మరియు విశ్రాంత చీఫ్ ఇన్కమ్ టాక్స్ కమిషనర్ శ్రీ పివి రావు గారు, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ మరియు సెయింట్ మేరిస్ రిహబ్లిటేషన్ యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ కెవికె రావు గారు పాల్గొన్నారు.
అలాగే విశ్రాంత ఐఐఎస్ ఆఫీసర్ శ్రీ కూనపురెడ్డి హరి ప్రసాద్ గారు, ప్రముఖ డాక్టర్ పి ఎల్ ఎన్ పటేల్ గారు, ఆద్య హాస్పిటల్ చైర్మన్ డా శ్రీనివాసులు గారు, ఎండి, డాక్టర్ భవాని గారు, పెద్దలు ఆల్ ఇండియా కాపు సంఘం (All India Kapu Sangham) మాజీ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ రావు గారు, అడపా ఉదయభాస్కరరావు గారు, గంధం లక్ష్మీ సత్య శేఖర్ గారు, లింగం ఉమామహేశ్వర గారు పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.
గిడుగు వెంకట రమణ గారు, రామిశెట్టి రామ్మూర్తి నాయుడు గారు, అల్లం నాగేశ్వరావు గారు, మహిళా నాయకురాలు ప్రభావతి గారు, న్యాయవాది గంగా కీర్తి గారు, లక్ష్మీనాయుడు గారు, ప్రభ గారు, సత్యకుమారి గారు, కుత్బుల్లాపూర్ కాపు సంఘం (Kapu Sangham) సత్యనారాయణ గారు, డి నాగేశ్వరావు గారు, రమణ కుమార్ గారు, మత్తి చంద్రశేఖర్ గారు, ఎర్రంశెట్టి రావు తదితర కాపు నాయకులు కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు కొత్తగా ఆత్మీయ యూఎస్ఏ (Atmiya USA) బోర్డ్ చైర్ గా నియమితులైన డాక్టర్ మంజుల రగుతు (Dr. Manjula Raguthu) గారికి మరియు కొత్తగా ఎన్నిక కాబడిన ఆత్మీయ యూఎస్ఏ టీమ్ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆత్మీయ యూఎస్ఏ ద్వారా ఇండియా (India) లో జరగబోయే కార్యక్రమాల గురించి చర్చలో వక్తలు అభిప్రాయములను వెలుబుచ్చినారు.