Minneapolis, Minnesota: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ‘Giving Back to the Community’ అనే నినాదం తో ఈ సంవత్సరం పలు సేవా కార్యక్రమాలలో పాల్గొని, నిర్వహించి సేవయే తమ ప్రధమ కర్తవ్యంగా ముందుకి వెళుతోంది.
ఈ కార్యక్రమంలో భాగముగా Minneapolis లో IOCP- Interfaith Outreach & Community Partners అనే ఫుడ్ షెల్ఫ్ సంస్థకు పది సిటీస్ లో ఫుడ్ డ్రైవ్ నిర్వహించి ఫుడ్ షెల్ఫ్ కి కావలిసిన సరుకులను ఆ సిటీస్ లో ఉంటున్న ఎందరో తెలుగు కుటుంబాలు పాల్గొని ఎంతో సహకరించి డొనేషన్ రూపముగా ఇవ్వడం అయినది.
ఈ కార్యక్రమానికి TANA North Central Team Representative రామ్ వంకిన (Ram Vankina) ఆధ్వర్యంలో, పలువురు వాలంటీర్స్ (Volunteers) సహాయంతో వాతావరణం మంచుతో , మైనస్ డిగ్రీస్ చలిలో కూడా అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహహించడం అయినది.
ఈ కమ్యూనిటీ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం TANA ప్రెసిడెంట్ Dr. నరేన్ కొడాలి, Executive President Elect శ్రీని లావు, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni) మరియు స్పెషల్ ప్రాజెక్క్ష్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి (Naga Panchumarthi) వారి ప్రోద్భలంతో నిర్వహించడం జరిగినది.
అలాగే ఈ కార్యక్రంకి పలువురు వాలంటీర్స్ అయిన వేదవ్యాస్ అర్వపల్లి (Vedavyas Arvapalli), బాబ్జి చెన్నుపాటి, మోహన్ వెలగపూడి, అజయ్ తాళ్లూరి (Ajai Talluri), విజయ ముత్యాల, అశోక్ సుంకవల్లి, RK అన్నే, సురేష్ బొర్రా, అభిరాం తాళ్లూరి, కోటేశ్వర రావు పాలడుగు, ఆకాష్ మరియు ఎందరో సహకారం అందించడం అయినది.
ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహించిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) Minneapolis టీంని Interfaith Outreach & Community (IOCP) స్టాఫ్ ప్రశంసిస్తూ ధన్యవావాలు తెలుపడం అయినది. ఈ పాట్నర్షిప్ ఇలాగే కొనసాగాలని కూడా కోరడమైనది.