Connect with us

Associations

అమెరికాలో కష్టం వస్తే ఆదుకునేది ఒక్క ATA సంస్థే: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

Published

on

Hyderabad, Telangana: అమెరికాలో కష్టం వస్తే ఆదుకునేది ఒక ఆటా (ATA) సంస్థనేనని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (Devireddy Sudheer Reddy) అన్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ATA) ప్రతినిధులతో రణదీప్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయగా, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి – కమల సుధీర్ రెడ్డి దంపతులు హాజరై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఆటా బృందంతో గడిపారు.

ఈ సందర్భంగా ప్రవాస తెలుగు సమాజం, స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం, విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి సేవలు, వారి అనుభవాలను స్వదేశాభివృద్ధికి ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై ఎమ్మెల్యే (MLA) తో చర్చించారు.

అలాగే ఆటా (ATA) చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం, యువత సాధికారత దిశగా అమలు చేస్తున్న ప్రణాళికలను వారు ఎమ్మెల్యేకు వివరించారు. ముఖ్యంగా ప్రవాసుల సహకారంతో గ్రామీణాభివృద్ధి, నైపుణ్య శిక్షణ, స్టార్టప్ (Startup) ప్రోత్సాహం వంటి అంశాల గురించి ఎమ్మెల్యే కి వివరించి, సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీలు (ATA Board of Trustees), కో చైర్ నరసింహ ద్యాసాని, సాయి సూదిని, శ్రీకాంత్ గుడిపాటి, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల, బోర్డు ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త, రామకృష్ణ అల, శ్రీధర్ తిరిపతి, మాజీ అధ్యక్షులు పరమేష్ భీమ్ రెడ్డి, బిజినెస్ చైర్ హరీష్ బత్తిని, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సి రెడ్డి, విష్ణు మాధవరం, సుమ ముప్పల, తిరుమల్ రెడ్డి, రాజ్ కరకల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, సుమన్ బర్ల, వేణుగోపాల్ సంకినేని, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected