ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘TANA‘ ఆధ్వర్యంలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం లోని 5 మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు UTF మోడల్ పరీక్ష పేపర్లు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali) మరియు తానా ఫౌండేషన్ ట్రస్టీ త్రిలోక్ కంతేటి (Trilok Kantheti) నిర్వహిస్తున్నారు.
రేపల్లె (Repalle, Bapatla District) లోని తానా ఆశ్రమం వేదికగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి, నగరం, భట్టిప్రోలు, నిజాంపట్నం మరియు రేపల్లె మండలాల విద్యార్థులు పాల్గొననున్నారు. ఈనాటికీ గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) సదుపాయాలు, విద్యా ప్రమాణాలు, ఉత్తీర్ణతా శాతం అంతంత మాత్రమే ఉండడంతో తానా (TANA) తన వంతుగా ఈ సహాయం చేస్తుంది.
10వ తరగతి పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యేలా, ఉత్తీర్ణతా శాతం పెంచేలా ఈ UTF మోడల్ పరీక్ష పేపర్లు గ్రామీణ ప్రాంత (Repalle, Bapatla District) విద్యార్థులకు చక్కగా ఉపయోగపడతాయని తానా నాయకులు (TANA Leaders) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.