Connect with us

Diwali

ఆనందోత్సవాల నడుమ TAMA దీపావళి, ఆకట్టుకున్న గీతామాధురి & అరియనా @ Atlanta, Georgia

Published

on

Atlanta, Georgia: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా) వారు 2025 నవంబర్ 8వ తేదీన కమ్మింగ్ లోని దేశాన మిడిల్ స్కూల్ (DeSana Middle School) లో ఆనందోత్సవాల మధ్య జరిపారు. ఈ వేడుకకు దాదాపు 600 మంది హాజరయ్యారు. తొలుత దీనికి పార్వతి కొంపెల్ల (Parvati Kompella) వ్యాఖ్యాతగా మొదలుపెట్టారు.

తరువాత బిగ్ బాస్ (Big Boss) ఫేమ్ అరియనా కొనసాగింపు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అరియనా స్టేజి (Ariyana Glory) దిగి, వచ్చిన వారందరినీ హుషారుగా ప్రశ్నలు అడుగుతూ, వారిచే పాటలు కూడా పాడించారు. అట్లాంటా (Atlanta) లోని చాలా మంది తెలుగు వారందరూ హాజరైన ఈ వేడుకలో భారతీయ సంస్కృతి వైభవం, వారి కట్టు బొట్టులో ప్రతిబింబించింది.

ఇదే రోజు మధ్యాహ్నం, 3 నుండి 12 వ తరగతి పిల్లల కొరకు మ్యాథ్ బౌల్ (Math Bowl) పోటీలను నిర్వహించారు. విజేతలకు బాబ్ ఎర్రమిల్లి (Bob Erramilli – జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ సభ్యుడు) చేతులమీదుగా విజేతలకు బహుమతులను అందజేశారు. జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ (Johns Creek City Council Member) మరొక సభ్యుడు దిలీప్ తుంకి (Dilip Tunki) కూడా ఈ వేడుకలో పాలుపంచుకొన్నారు.

ఈ సందర్భంగా తామా వారు శ్రీ శ్రీనివాస రాయపురెడ్డి (Srinivas Rayappureddy) మెమోరియల్ అవార్డును ఈ సంవత్సరపు స్వచ్చంద సేవకుడిగా ఎంపికైన ఫణింద్ర జమ్ముల గారికి అలాగే డాక్టర్ శ్రీహరి మాలెంపాటి (Dr. Srihari Malempati) మెమోరియల్ అవార్డును ఈ సంవత్సరపు క్లినిక్ స్వచ్చంద సేవకుడిగా ఎంపికైన కింటూ షా (Kintu Shaw) గారికి బహూకరించడం జరిగింది.

పురస్కార గ్రహీతలు తమను ఈ గౌరవానికి ఎంపిక చేసినందుకు తామా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే వేదిక పై తామా (TAMA) ఆధ్వర్యాన నడుస్తున్న మనబడి (SiliconAndhra Manabadi) ప్రాంతీయ సమన్వయకర్తలు, అధ్యాపకులను కూడా సత్కరించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా మగవారితో ఫాషన్ షో ఏర్పాటు చేయడం జరిగింది.

అలాగే రాఫెల్ టికెట్స్ విజేతలకు మొదటి బహుమతిగా రోబోటిక్ వాక్క్యూమ్ క్లీనర్ ను రెండవ బహుమతి గా 50″ టీవీ ను ఇవ్వడం జరిగింది. వచ్చిన వారందరికీ డబ్బావాలా రెస్టారెంట్ (Dabbahwala Restaurant) వారు అందించిన రుచికరమైన విందు భోజనం వడ్డించారు. పిల్లలకు జుజుస్ పిజ్జా (Zuzu’s Pitsa) నుండి పిజ్జా ను ఇచ్చారు. మొత్తం 30 కి పైగా స్టాల్ల్స్ ను ప్రదర్శించారు.

స్టాల్ ప్రదర్శించిన వారు: హెల్త్య్ హ్యాపీ ఆర్గానిక్ (Health Happy Organic), తేరా టైనీ (Tera Tiny Treasures), వీణ ఫ్యాషన్స్ (Veena Fashions), లైట్ స్ట్రీమ్ లూమ్స్ (LightStream Looms), స్వాంకీ మెడ్లే (Swankey Medley), ఔరా కలెక్షన్స్ (Aura collections), KKR GenAI ఇన్నోవేషన్స్, ఇష్ట సఖి (Ishta Sakhi)

గ్లోబల్ త్రొమ్బోసిస్ ఫోరమ్ (Global Thrombosis Forum), మీనాక్షి కలెక్షన్స్ (Meenakshi Collections), గెట్ బిట్ (Get Bit) టెక్నాలజీస్, జెవెల్ జాయ్ (Jewel Joy) కలెక్షన్స్, కాటన్ క్యాండీ (Cotton Candy), ఎవర్గ్రీన్ ఫార్మ్స్ (Evergreen Farms), సుహాసిని నల్బాల (Suhasini Nalabala), AV కలెక్షన్స్, కార్తీక, కెడ్స్ (Keds), చెన్న కేశవ్ EB5.

కార్యక్రమానికి ప్లాటినం స్పాన్సర్ గా దేశి డిస్ట్రిక్ట్ (Desi District), గోల్డ్ స్పాన్సర్ గా శేఖర్ రియాల్టీ, వేలా (VeLa) – వెంకట్ అడుసుమిల్లి, కాకతీయ ఇండియన్ కిచెన్, పటేల్ బ్రదర్స్, డబ్బా వాలా, రియల్ టాక్స్ అల్లీ (Real Tax Ally), ట్రూ వ్యూ (TruVu), కెడ్స్ (Keds), చెస్ ట్రానిక్స్ (Chess Tronics), సన్ షైన్ పార్టనర్స్ గ్రూప్, హన్స్ (Hans) ఫైనాన్సియల్ గ్రూప్, అనైశ్వర్ ఫైనాన్సియల్స్, కోడ్ హీరో (Code Hero) అకాడెమి, AoPS అకాడెమి, జుజుస్ పిజ్జా (Zuzu’s Pitsa) వ్యవహరించారు.

అలాగే AG ఫిన్ టాక్స్ (AG FinTax), అప్ టు డేట్ (Up2Date)టెక్నాలజీస్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, బైట్ గ్రాఫ్ (ByteGraph) ఈవెంట్స్ & బ్రోన్జ్ (Bronze) స్పాన్సర్ గా గిరీష్ మోడీ (Girish Modi), VPR రియల్టర్, 3rd Eye, Jade బాంకెట్స్, డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, #టాగ్ ఇండియా (#Hashtag India), గరుడ వేగా, బారెల్ హుడ్ (Barrelhood), క్రూయిస్ పార్టనర్స్ (Cruise Partners), షాలిని పగడాల, కమ్మింగ్ డెంటల్, XCLD సాఫ్ట్, KW రియాల్టీ మరియు ఇతర సంస్థలు, వ్యక్తులు కూడా స్పాన్సర్ గా తోడ్పడ్డారు.

ఈ దీపావళి వేడుకలో ఇతర భారతీయ స్వచ్చంద సంస్థలైన AAA, GATeS, GTA, IACA, TANA, ATA, NRIVA, VSS, TDF, GATA & APTA ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమాగమం తెలుగు మరియు ఇతర భారతీయ సంఘాల మధ్య ఐక్యతను మరింత బలపరచిందని వచ్చినవారు అభిప్రాయపడ్డారు.

దీపావళి వేడుకల్లో భాగంగా 30 కి పైగా ప్రాంతీయ నృత్య పాఠశాలల్లోని పిల్లలు, పెద్దలు చేసిన సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో, దీపావళి కాంతులతో సంతోషం వెల్లివిరిసింది. వేడుకపై తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, ఫాషన్ షోలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి.

ముఖ్యంగా ప్రధాన ఆకర్షణగా గీత మాధురి (Geetha Madhuri) & హనుమాన్ సంయుక్తంగా సంగీత విభావరిలో టపాసులు, చిచ్చుబుడ్డి లాంటి వివిధ రకాల పాటలు పాడి అలరించారు. ఈ పాటలకు అనుగుణంగా అరియనా & సత్య మాస్టర్ లు ఆహూతులచే నృత్యాలు కూడా చేయించారు. ఒకానొక సమయం లో పాటల హోరులో పిన్నలూ, పెద్దలూ అందరూ నృత్యం చేయటం ఈ వేడుకకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.

ఈ కార్యక్రమాన్ని సమార్తంగా సమన్వయం చేసిన తామా (TAMA) అధ్యక్షులు రుపేంద్ర వేములపల్లి, బోర్డు చైర్మన్ రాఘవ తడవర్తి, వారికి తమవంతు సహాయం చేసిన స్వచ్చంద సేవకులు, కార్యనిర్వాహక బృందం & బోర్డు బృందం అందరికీ స్ఫూర్తినిచ్చేలా నిలిచింది. అందరికీ సంఘం అధ్యక్షులు మరియు బోర్డు చైర్మన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇందులో పాల్గొని విజయవంతం చేసినవారు: సునీత పొట్నూరు (ప్రెసిడెంట్ ఎలెక్ట్), ప్రధాన కార్యదర్శి: తిరుమల రావు చిల్లపల్లి, కోశాధికారి: సునీల్ దేవరపల్లి, సాంకేతిక కార్యదర్శి: చలమయ్య బచ్చు, సాహిత్య కార్యదర్శి: శ్రీనివాస్ రామనాధం, విద్యా కార్యదర్శి: ముఖర్జీ వేములపల్లి, కమ్యూనిటీ కార్యదర్శి: కృష్ణ ఇనపకుతిక, ఈవెంట్స్ కార్యదర్శి: శేఖర్ కొల్లు, మహిళా కార్యదర్శి: పార్వతి కొంపెల్ల, క్రీడల కార్యదర్శి: సురేష్ యాదగిరి, బోర్డు సభ్యులు: సాయిరాం కారుమంచి, యశ్వంత్ జొన్నలగడ్డ, రాంకీ చౌడారపు, వెంకట తెరల, శ్రీనివాస్ ఉప్పు, తామా పూర్వ అధ్యక్షులు: సురేష్ బండారు, సంస్థ శ్రేయోభిలాషులు: శ్రీనివాస్ లావు, అంజయ్య లావు, వినయ్ మద్దినేని, భరత్ మద్దినేని, మధుకర్ యార్లగడ్డ మొదలగు వారు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected